Viral Video: ప్రాణాలను సైతం లెక్కచేయని వాహనదారులు.. ఒకే బైక్ మీద ఏడుగురు ప్రయాణం.. షాకింగ్ వీడియో వైరల్..

రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోలు, నిత్యావసరాల ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ధరల భారం తట్టుకోలేక వారు తీసుకునే నిర్ణయాలు తీవ్రంగానే ఉంటున్నాయి. అంతేకాదు అందుకు ఉదాహరణే ఈ వీడియో అంటూ తెగ షేర్ చేస్తున్నారు.

Viral Video: ప్రాణాలను సైతం లెక్కచేయని వాహనదారులు.. ఒకే బైక్ మీద ఏడుగురు ప్రయాణం.. షాకింగ్ వీడియో వైరల్..
Bike Rider Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jun 19, 2022 | 7:29 PM

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు నేటి పరిస్థితికి సామాన్యుడి దుస్థితికి అద్దం పడుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ఒక బైక్ మీద ఒకరు కాదు ఇద్దరు కాదు.. పిల్లలు, పెద్దలు కలిసి మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. దీంతో రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోలు, నిత్యావసరాల ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ధరల భారం తట్టుకోలేక వారు తీసుకునే నిర్ణయాలు తీవ్రంగానే ఉంటున్నాయని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు అందుకు ఉదాహరణే ఈ వీడియో అంటూ తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం తెగ వైరల్‌ వీడియో చూసిన నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి నిర్ణయం సరికాదంటున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఎక్కడికో బయలుదేరాడు. అయితే అక్కడ రెండు ఫ్యామిలీలు కనిపిస్తున్నాయి. ఇద్దరు మహిళలు, వారితోపాటు నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వీరంతా కలిసి ఒకే బైక్‌పై ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బైక్‌ ముందు భాగంలో ఇద్దరు చిన్నారులను కూర్చో బెట్టారు. బండి నడిపే వ్యక్తి.. వెనుక మొదట ఒక మహిళ కూర్చుని ఉంది..వెంటనే ఆ మహిళకు మరోవైపు ఒక చిన్నారిని అందజేసింది.. ఆ వెనుక తాను బండిమీద ఒక చిన్నారిని తీసుకుని ఒడిలో పెట్టుకునుని కూర్చుంది.

ఇలా అందరూ బండి మీద అంటే మోటార్ బైక్ ముందు ఇద్దరు పిల్లలు. బండి నడిపే వ్యక్తి.. వెనుక ఇద్దరు మహిళలు, వారి ఒడిలో ఇద్దరు చిన్నారు.. అలా ఒకే బైక్‌ పైన ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఇది బైక్ కాదు..ఓ చిన్న సైజ్ ఆటోరిక్షా అంటూ కామెంట్ చేస్తూనే..  ఒకే బైక్‌పై అంతమంది ప్రయాణించడం ప్రమాదమని చెబితే.. పెట్రోలు ధరలు మండిపోతున్నాయి… అంత దూరం మళ్లీ మళ్లీ తిరగాలంటే చాలా ఖర్చవుతుంది.. అందుకే ఇలా వెళ్తున్నారెమో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా రిక్స్ తీసుకుని ప్రయాణాలు చేస్తూ.. చేజేతులా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?