AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మతి మరుపు ఆమెకు రూ. 32 లక్షలు తెచ్చి పెట్టింది.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఎగిరిపోవడం ఖాయం..!

Lucky Woman: మతి మరుపు.. కొన్ని సార్లు వ్యక్తుల జీవితాలు ఆగమయ్యేలా చేస్తే.. మరికొన్నిసార్లు ఊహించని అద్భుతాలను తీసుకువస్తుంది. తాజాగా ఓ మహిళ జీవితంలో ఇలాంటి విచిత్ర..

Viral News: మతి మరుపు ఆమెకు రూ. 32 లక్షలు తెచ్చి పెట్టింది.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఎగిరిపోవడం ఖాయం..!
Woman
Shiva Prajapati
|

Updated on: Dec 17, 2021 | 6:28 PM

Share

Lucky Woman: మతి మరుపు.. కొన్ని సార్లు వ్యక్తుల జీవితాలు ఆగమయ్యేలా చేస్తే.. మరికొన్నిసార్లు ఊహించని అద్భుతాలను తీసుకువస్తుంది. తాజాగా ఓ మహిళ జీవితంలో ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. ఆమె మరిచిపోయిన ఓ అంశం.. ఇప్పుడు ఆమెను లక్షాధికారిని చేసింది. కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. ఆ మహిళ మరిచిపోయిన ఓ సంఘటన ఆమెకు హెల్ప్‌ చేసింది. ఏకంగా రూ. 35 లక్షలు ఆమెకు లభించాయి. బ్యాంక్ అధికారులు స్వయంగా కాల్ చేసి ఆమెకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఒక వంద రూపాయలు సంపాదించాలంటేనే ఒక రోజంతా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. సంపాదించిన డబ్బు కూడా ఏ మాత్రం సరిపోని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండోనేషియాలో విచిత్ర సంఘటన వెలుగు చూసింది. ఇండోనేషియాకు చెందిన సిండి ప్రసేత్య అనే మహిళ.. కొన్నాళ్ల క్రితం బ్యాంకులో రూ.5 లక్షలు జమ చేసింది. అయితే ఆమె ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఆ తరువాత ఉద్యోగం లేకపోవడం, ఆర్థికంగా చితికిపోయి దుర్భర జీవితాన్ని గడుపుతోంది. ఈ క్రమంలో బ్యాంకు నుంచి ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఊహించని రీతిలో వారు.. మీ ఖాతాలో రూ.35 లక్షలు జమ అయినట్లు చెప్పారు. అది విన్న మహిళ ఆశ్చర్యపోయింది. బ్యాంకు నుంచి వచ్చిన కాల్ నిజమో, అబద్ధమో అర్థం కాక నిశ్చేష్ఠురాలైంది. ఆ తరువాత.. గతంలో తాను డిపాజిట్ చేయడం గురించి గుర్తు చేసుకుంది.

సిండి కొన్నేళ్ల క్రితం బ్యాంకులో తన పేరిట ఖాతాను తెరిచింది. ఆ సమయంలో రూ. 5 లక్షలు డిపాజిట్ చేసింది. ఆ తరువాత ఆ విషయాన్నే మరిచిపోయింది. ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని సాఫీగా గడిపుతూ వచ్చింది. అయితే, కొంతకాలం క్రితం ఉద్యోగం పోవడంతో ఆమె పరిస్థితి దారుణంగా మారింది. ఆర్థికంగా కునారిల్లిపోయింది. బతుకే భారమైపోయింది. అయితే, ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేసిన సొమ్ముకు వడ్డీ ప్రతీ ఏటా పెరుగుతూ వచ్చింది. అది చివరకు రూ. 35 లక్షలు అయ్యింది. దాంతో బ్యాంకు అధికారులు ఆమెకు కాల్ చేసి సమాచారం అందించారు. డబ్బుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. బ్యాంకు అధికారులు చెప్పిన మాటలను సిండి తొలుత నమ్మలేదు. ఆ తరువాత గతంలో తాను అకౌంట్ తీసిన విషయం గుర్తుకు రావడంతో అప్పుడు నమ్మింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సిండికి.. ఇది నిజంగా జాక్ పాట్ లాంటి వార్త అనే చెప్పాలి. అందుకే అంటారు విధి ఎప్పుడు ఎవరి జీవితాలను ఎలా మలుపు తిప్పుతుందో అని. కాగా, సిండి బ్యాంకు అకౌంట్‌కు సంబంధించి, ఆమె వివరాల గురించి బ్యాంక్ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది.

Also read:

Manasa Varanasi: కరోనా కల్లోలం.. మిస్ వరల్డ్ పోటీలకు షాక్.. మిస్ ఇండియాకు కోవిడ్..

Viral Video: కొబ్బరి కాయల మధ్య దాగుంది.. కూలీలు వెళ్లగానే ఒక్కసారిగా..

MLC Pochampally Srinivas Reddy: చెక్కు చెదరని పోచంపల్లి రికార్డు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి చరిత్ర సృష్టించారు..!