- Telugu News Photo Gallery Miss india manasa varanasi and other miss world contestants test covid positive miss world 2021
Manasa Varanasi: కరోనా కల్లోలం.. మిస్ వరల్డ్ పోటీలకు షాక్.. మిస్ ఇండియాకు కోవిడ్..
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహామ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు బ్రేక్ పడింది.
Updated on: Dec 17, 2021 | 6:16 PM

ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకునేందుకు వచ్చిన అందగత్తెలకు కూడా కోవిడ్ వైరస్ సోకింది. కంటెస్టెంట్స్‌తో పాటు మొత్తం 17 మంది కరోనా బారినపడ్డారు.

తెలుగమ్మాయి మిస్ ఇండియా మానస వారణాసి కూడా కరోనా భారీన పడింది. భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడుతోంది మానస వారణాసి.

ప్యూర్టోరికో వేదికగా 2021 మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. వివిధ దేశాల అందగత్తెలంతా అక్కడికి చేరుకున్నారు.

అయితే, కంటెస్టెంట్స్‌తోపాటు నిర్వాహకులు కూడా కరోనా బారిన పడటంతో బ్యూటీ ఈవెంట్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

రాబోయే 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రకటించారు.

23ఏళ్ల మానస వారణాసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా 2020 పోటీల్లో విజేతగా నిలిచి మిస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించింది. హైదరాబాద్ ఎఫ్ఐఐటీలో ఇంటర్ కంప్లీట్ చేసింది.

ఆ తర్వాత.. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసింది.

ఫాక్ట్ సెట్లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ విశ్లేషకురాలిగా పనిచేసింది

2021 ఫిబ్రవరి 10న ముంబైలోని హయత్ రీజెన్సీలో అవుట్ గోయింగ్ టైటిల్ హోల్డర్ సుమన్ రావు చేత ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020గా కిరీటం అందుకుంది.




