2 ఏళ్ల క్రితమే నేపాల్ రాజకీయ పరిణామాలను ఊహించిన జ్యోతిష్కుడు.. ఏమి చెప్పాడంటే
మన పొరుగు దేశం నేపాల్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. జనరల్ జెడ్ ఉద్యమంతో నేపాల్ సర్వత్రా హింసాకాండ చేలరింది. పార్లమెంట్ పునాదులు కదిలాయి. నేపాల్ యువత ఆందోళనతో ప్రధాని కె.పి. ఓలి రాజీనామా చేసి అదృశ్యమయ్యారు. మరోవైపు నేపాల్ మళ్ళీ రాజరికం దిశగా అడుగులు వేస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. డెవిల్ జోతిష్కుడుగా పేరుగాంచిన ప్రశాంత్ కినీ పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.

నేపాల్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. అల్లర్లు చెలరేగాయి. ప్రధాని కె.పి. ఓలి సహా పలువురు మంత్రులు రాజీనామా చేసి అదృశ్యమయ్యారు. తాజాగా కొత్త ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్‌ను నియమించారు. మరికాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అదే సమయంలో నేపాల్ లో ప్రజాస్వామ్యం అంతం అవుతుందని ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రశాంత్ కినీ అనే జ్యోతిష్కుడు తన సోషల్ మీడియా వేదికగా నేపాల్ గురించి ఒక అంచనా వేస్తూ Dec 16వ తేదీ 2023న ఒక పోస్ట్ చేశాడు. అందులో నేపాల్‌లో ప్రజాస్వామ్యం అంతం దగ్గర పడింది. 2025 లో నేపాల్‌లో రాచరికం తిరిగి వస్తుందని పేర్కొన్నాడు.
ఈ ప్రశాంత్ కినీ తన X బయో డేటాలో .. తాను రాజకీయాలను అంచనా వేస్తానని, అరచేతులను చూసి వారి భవిష్యత్ చెప్పగలనని, తాను టారో రీడర్ కూడా అని పేర్కొన్నాడు. అతను మార్చి 2023లో Xలో చేరాడు
— Prashanth Kini (@AstroPrashanth9) September 9, 2025
నేపాల్ లో 2025 లో రాచరికం తిరిగి వస్తుంది” అని జ్యోతిష్కుడు అంచనా వేసిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత.. ఆ దేశంలో భారీ నిరసన చెలరేగింది. దీని ఫలితంగా నేపాల్ ప్రధాన మంత్రి కెపి ఓలి, ఇతర ఉన్నతాధికారులు రాజీనామా చేశారు.
అక్టోబర్ 2023లో ప్రశాంత్ “ఖతార్ గురించి నా అంచనా.. జూన్ 2025 నుంచి జూలై 2026 మధ్య ఖతార్ పాలక వర్గం తీవ్ర ఇబ్బందుల్లో పడనుంది. 2028- 29 సంవత్సరంలో ఖతార్ భారీ విధ్వంసం చవిచూస్తుంది. ఆర్థిక మాంద్యం భారీ అగ్ని ప్రమాదం, ఉగ్రవాద దాడి సాధ్యమే” అని పోస్ట్ చేశాడు. సెప్టెంబర్ 9న ఈ పోస్ట్ ని రీ పోస్ట్ చేస్తూ, “ఇజ్రాయెల్ ఈరోజు ఖతార్‌పై దాడి చేసింది” అని రాశాడు. హమాస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఖతార్‌లోని దోహాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి ప్రారంభించిన తర్వాత ఇది జరిగింది
మార్చిలో సాహసోపేతమైన అడాల్ఫ్ హిట్లర్ తరహా ప్రసంగం ద్వారా వైరల్ అయిన నేపాల్ యువకుడు గుర్తుందా? ఇప్పుడు ఆ యువకుడు ఖాట్మండులో జనరల్ జెడ్ నిరసనకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నిరసన దేశ రాజకీయ నిర్మాణాన్ని కుదిపేసింది. అవిష్కర్ రౌత్ అనే యువకుడు ఒక స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో నేపాల్‌లో అవినీతిపై నిర్భయంగా ప్రసంగం చేశాడు. దీంతో వైరల్ అయ్యాడు. అతని “జై నేపాల్” ప్రసంగం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఆరు నెలల తర్వాత భారీ నిరసనకు కేంద్రంగా మారింది. అంతేకాదు అనేక మంది మృతికి కారణం అయింది. మరోవైపు ఆ దేశ ప్రధానమంత్రి, ప్రముఖ దేశాధినేతలు తమ పదవులకు రాజీనామా చేయవలసి వచ్చింది. నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో రౌత్ నిరసనలో చురుగ్గా పాల్గొంటూ, మైక్ పట్టుకుని నినాదాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అతని వెనుక యంగ్ స్టూడెంట్స్ బృందం ఉన్నట్లు కనిపించింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




