Ikea Food Court: ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ ను ఆస్వాదిస్తూ తింటున్న మహిళ .. హఠాత్తుగా టేబుల్‌పై చచ్చిన ఎలుక ప్రత్యక్షం..
శరణ్య శెట్టి అనే ట్విట్టర్ ఖాతాలో షాకింగ్ చిత్రాన్ని పంచుకుంది. దీనిలో టేబుల్‌పై చనిపోయిన ఎలుక కనిపించింది. అంతేకాదు ఫోటో క్యాప్షన్‌లో 'IKEA ఫుడ్ కోర్ట్‌లో మా డైనింగ్ టేబుల్‌పై ఏమి పడిందో ఊహించండి' అని రాశారు. అంతేకాదు ఆ మహిళ ఇంకా ఇలా రాసింది, 'మేము తింటున్నాము .. అప్పుడే మా టేబుల్ పై చనిపోయిన ఎలుక పైకప్పు నుండి పడింది
మీరు ఫుడ్ కోర్ట్‌లో ఇష్టమైన ఆహార పదార్ధాలను ఆస్వాదిస్తూ తింటున్నారు.. ఇంతలో అకస్మాత్తుగా మరణించిన ఎలుక మీ టేబుల్‌పై పడితే.. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది. హఠాత్తుగా జరిగిన సంఘటనతో సహజంగానే మీరు మొదట భయాందోళనలకు గురవుతారు. తర్వాత హోటల్ మేనేజర్‌ని తిట్టుకుంటారు. కర్ణాటక లోని ప్రముఖ నగరంలో ఓ ఫుడ్ కోర్టులో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఫర్నీచర్ రిటైలర్ ఫుడ్ కోర్ట్‌లో స్నాక్స్ ఆస్వాదిస్తున్న ఓ మహిళ ఇలాంటి సంఘటనే జరిగింది. ట్విట్టర్‌లో @Sharanyashettyy అనే వినియోగదారు ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది. Ikea స్టోర్‌లో సీలింగ్ నుండి చనిపోయిన ఎలుక తాను తింటున్న టేబుల్‌పై పడినప్పుడు భయంకరమైన సంఘటనను తాను ఎదుర్కొన్నట్లు పేర్కొంది.
శరణ్య శెట్టి అనే ట్విట్టర్ ఖాతాలో షాకింగ్ చిత్రాన్ని పంచుకుంది. దీనిలో టేబుల్‌పై చనిపోయిన ఎలుక కనిపించింది. అంతేకాదు ఫోటో క్యాప్షన్‌లో ‘IKEA ఫుడ్ కోర్ట్‌లో మా డైనింగ్ టేబుల్‌పై ఏమి పడిందో ఊహించండి’ అని రాశారు. అంతేకాదు ఆ మహిళ ఇంకా ఇలా రాసింది, ‘మేము తింటున్నాము .. అప్పుడే మా టేబుల్ పై చనిపోయిన ఎలుక పైకప్పు నుండి పడింది. ఇది చాలా షాకింగ్ క్షణంమాకు అని పేర్కొంది.
క్షమాపణలు చెప్పిన ఐకియా ఈ ఘటనను సదరు మహిళ ఆదివారం మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పంచుకుంది. అప్పటి నుండి పోస్ట్ ఇంటర్నెట్ వినియోగదారులను దృష్టిని ఆకర్షించింది. ఇదే విషయంపై భారతదేశానికి చెందిన IKEA కూడా స్పందిస్తూ జరిగిన ఘటనపై మహిళకు క్షమాపణలు చెప్పింది.
ఐకియా ఏం చెప్పిందంటే? IKEA నాగసంద్రలో జరిగిన అసహ్యకరమైన సంఘటనకు తాము క్షమాపణలు కోరుతున్నాము. మేము దీనిని పరిశీలిస్తున్నాము.. ఇక నుంచి ముందుగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆహార భద్రత, పరిశుభ్రత తమ మొదటి ప్రాధాన్యత అని ఐకియా రాసింది. తమ కస్టమర్‌లు తమ షాప్ లో అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్నిఇవ్వాలని.. కస్టమర్స్ కూడా షాపింగ్ అనుభవాన్ని పొందాలని తాము కోరుకుంటున్నామని స్పష్టం చేసింది.
Wtf.. guess what fell in our food table at ikea 🤕🤕🤕🤒🤒 I can’t even. We were eating and this rat just dropped dead.. Most bizzare moment ever!@IKEA@IKEAIndia pic.twitter.com/R45C1BCNkc
— Maya (@Sharanyashettyy) July 16, 2023
వింత ఘటన పై ప్రజల స్పందన అయితే ఈ వింత ఘటనపై నెటిజన్లు భారీగా స్పందించారు. ట్విట్టర్ వినియోగదారులు స్వీడిష్ కంపెనీ ఐకియాను తీవ్రంగా విమర్శించడమే కాకుండా.. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకరు వ్రాశారు ఓ గాడ్! నేను ఏమి చూశాను? ఇది చూసి నాకు వికారం మొదలైంది. మరోవైపు, మరొకరు మాట్లాడుతూ మీరు చిత్రాన్ని చూసి అసహ్యించుకుంటే, మరి ప్రత్యక్షంగా ఈ సంఘటనను ఎదుర్కొన్న మహిళ ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటుందో ఊహించుకోండి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..