AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భారీ కొండచిలువను లాఘవంగా పట్టుకున్న కుర్రాడు.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ ఖాయం..

ఈ యువకుడిని ఫ్లోరిడా నివాసి జేక్ వాలెరిగా గుర్తించారు. జేక్ పట్టుకున్న కొండ చిలువ పొడవు దాదాపు 19 అడుగులు, 56.6 కిలోల బరువు ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ భారీ కొండ చిలువ బర్మీస్ జాతికి చెందినది. ఈ జాతి కొండ చిలువ పొడవుకు ప్రసిద్ధి చెందింది. వైరల్ క్లిప్‌లో, బాలుడు కొండచిలువను పట్టుకోవడానికి దాని వైపు పరుగెత్తడాన్ని మీరు చూడవచ్చు.

Viral Video: భారీ కొండచిలువను లాఘవంగా పట్టుకున్న కుర్రాడు.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ ఖాయం..
Viral Video
Surya Kala
|

Updated on: Jul 18, 2023 | 5:15 PM

Share

పాముల్లో ఒకరకం పాము కొండచిలువ. ఈ కొండచిలువ మనిషికి సైతం అమాంతం మింగి అరిగించుకోగలదు. అందుకనే దీనిని చూస్తే భయంతో పారిపోతారు. అయితే ఓ 22 ఏళ్ల కుర్రాడు ఎవరూ ఊహించని పని చేశాడు.  ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొండచిలువను, అది కూడా ఒట్టి చేతులతో పట్టుకున్నాడు. అవును, మీరు చదివింది పూర్తిగా నిజమే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరికైనా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే వైరల్ క్లిప్‌లో కొండచిలువ బాలుడిని చుట్టిన విధానం.. ఆ దృశ్యం నిజంగా భయానకంగా ఉంది.

ఈ యువకుడిని ఫ్లోరిడా నివాసి జేక్ వాలెరిగా గుర్తించారు. జేక్ పట్టుకున్న కొండచిలువ పొడవు దాదాపు 19 అడుగులు, 56.6 కిలోల బరువు ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ భారీ కొండచిలువ బర్మీస్ జాతికి చెందినది. ఈ జాతి కొండచిలువ పొడవుకు ప్రసిద్ధి చెందింది. వైరల్ క్లిప్‌లో, బాలుడు కొండచిలువను పట్టుకోవడానికి దాని వైపు పరుగెత్తడాన్ని మీరు చూడవచ్చు. తనవైపు వస్తున్న యువకువైపు కొండ చిలువ భారీగా నోరు తెరుస్తూ హఠాత్తుగా దూకింది. అదే సమయంలో యువకుడు చాకచక్యంగా కొండచిలువ నోటిని నొక్కి పట్టుకున్నాడు. అయితే ఈ సమయంలో జేక్ ఒక్కడే కాదు. అతని ఇతర సహచరులు కూడా పాముని పట్టుకోవడంలో సహకరించారు.

ఇవి కూడా చదవండి

గ్లేడ్స్‌బాయ్స్ అనే ఖాతాలోని ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హెయిర్ రైజింగ్ వీడియో షేర్ చేయబడింది. పైథాన్ వేటగాళ్లకు థాంక్స్ అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. ప్రపంచంలోనే అతి పొడవైన బర్మీస్ పైథాన్ ఇదే. 5 రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన వీడియోను దాదాపు 3 లక్షల మంది లైక్ చేయగా, చాలా మంది కామెంట్ చేశారు.

ఈ పెద్ద పాము ముందు నిలబడి ధైర్యంగా దీనిని చిత్రీకరించిన కెమెరామెన్ ధైర్యాన్ని కూడా అభినందించాలి అని ఒకరు కామెంట్ చేయగా, ఇది చాలా ప్రమాదకరమైన పాము అని మరొకరు రాశారు. జేక్ పట్టుకుని తీరు అతని దైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇది చూస్తుంటే తన దైర్యం దిగజారింది అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!