AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతిని సవాల్ చేస్తున్న వ్యక్తి.. DNA మార్చుకుని ఆయుష్షు పెంచుకునే ప్రయోగాలు

ఇంతకుముందు తన వయసును తగ్గించుకోవడం కోసం వార్తల్లోకి వచ్చిన కెర్నల్ కంపెనీ CEO బ్రియాన్ జాన్సన్ గురించి చాలా మందికి తెలిసిందే. జాన్సన్ తన చిన్న వయసులో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తాను యవ్వనంగా కనిపించడాని తన కొడుకు ప్లాస్మాను తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు కూడా. ఇది మాత్రమే కాదు.. ప్రస్తుతం అతను తన అసలు వయస్సు కంటే చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు.

ప్రకృతిని సవాల్ చేస్తున్న వ్యక్తి.. DNA మార్చుకుని ఆయుష్షు పెంచుకునే ప్రయోగాలు
Bryan Johnson
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2024 | 8:22 PM

ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి వర్తిస్తుంది. అయితే ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది ప్రకృతి నియమాలను ఉల్లంఘించి తమకు కావలసినది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు సంబంధించిన కథనాలు వెలుగులోకి వచ్చిన తర్వాత జనాలు ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఒక కథ ప్రస్తుతం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి తన డిఎన్‌ఎను మార్చుకోవడం ద్వారా ఆయుస్సుని.. ఆపై ధనవంతుడు కావాలనుకుంటున్నాడు. అవును ఈ రోజు సీక్రెచ్ ద్వీపంలో ప్రకృతిని సవాలు చేస్తున్న ఒక అమెరికన్ వ్యాపార వ్యాపారవేత్త గురించి తెలుసుకుందాం..

ఇంతకుముందు తన వయసును తగ్గించుకోవడం కోసం వార్తల్లోకి వచ్చిన కెర్నల్ కంపెనీ CEO బ్రియాన్ జాన్సన్ గురించి చాలా మందికి తెలిసిందే. జాన్సన్ తన చిన్న వయసులో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తాను యవ్వనంగా కనిపించడాని తన కొడుకు ప్లాస్మాను తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు కూడా. ఇది మాత్రమే కాదు.. ప్రస్తుతం అతను తన అసలు వయస్సు కంటే చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. అయితే ఇందు కోసం అతను ఆహారం కంటే ఎక్కువ మందులు తీసుకుంటాడు. అయితే ఇప్పుడు బ్రియాన్ జాన్సన్ తన జీవితాన్ని పెంచుకోవడానికి DNA ని మార్చుకోవడం మొదలు పెట్టాడు.

ప్రయోగాలకు ఇంత ఖర్చు చేస్తున్నారా?

మీడియా కథనాల ప్రకారం బ్రియాన్ జాన్సన్ ఇప్పుడు తన వయస్సును వెనక్కి వెళ్ళేలా చేసి తద్వారా తనను తాను చిరంజీవిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయంపై అతను సెప్టెంబర్ 2023లో హోండురాస్‌లోని రోటన్ అనే ద్వీపంలో రహస్య ప్రయోగం చేస్తున్నాడు. ఇందు కోసం బ్రియాన్ జాన్సన్ తన డీఎన్‌ఏను పూర్తిగా మార్చుకుంటున్నాడు. తద్వారా తన వృద్ధాప్య ప్రక్రియ మందగిస్తుందని వెల్లడించాడు. ఈ ప్రయోగం కోసం 20 వేల డాలర్ల ను వెచ్చిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. ఈ వీడియోలో అతను చాలా అరుదైన వైద్య ప్రక్రియ (జీన్ థెరపీ) కోసం మారుమూల ద్వీపానికి వెళ్తున్నానని.. ఇది విజయవంతమైతే మానవుల భవిష్యత్ పూర్తిగా మారుతుందని చెప్పాడు. అంతే కాకుండా మనిషి 120 ఏళ్ల పాటు హాయిగా జీవించవచ్చని వీడియోలో తెలిపాడు. ఈ థెరపీ గురించి ఆయన మాట్లాడుతూ.. మా నాన్నగారు 71 ఏళ్ల వయసులో దీన్ని చేయించుకున్నారు. దీని కారణంగా అతని వృద్ధాప్య వేగం 0.64గా మారిందని వెల్లడించాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..