Telugu News Trending Video of a child doing Garbha Dance has gone viral on social media
Viral Video: ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. డ్యాన్స్ కాంపిటీషన్ కు వెళ్తే ఫస్ట్ ఫ్రైజ్ పక్కా
చిన్న పిల్లలు తరచుగా ఆడటం, పరిగెత్తడం, మాటుల మనకు ఎంతో ఆనందం కలిగిస్తాయి. పిల్లలకూ అప్పుడప్పుడూ మనం డ్యాన్సింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాం. చిన్న చిన్న కదలికలు చెబుతుంటే వారు...
చిన్న పిల్లలు తరచుగా ఆడటం, పరిగెత్తడం, మాటుల మనకు ఎంతో ఆనందం కలిగిస్తాయి. పిల్లలకూ అప్పుడప్పుడూ మనం డ్యాన్సింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాం. చిన్న చిన్న కదలికలు చెబుతుంటే వారు దాన్ని అనుకరిస్తూ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది మనకు ఆనందం కలిగించడమే కాకుండా ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. ఇలా చిన్న పిల్లలు డ్యాన్స్ చేసే వీడియోలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఏదైనా పాట ఆడినప్పుడు గానీ, పాట ప్లే చేసినప్పుడు కానీ పిల్లలు ఆ మ్యూజిక్ కు అనుగుణంగా మూమెంట్స్ ఇస్తారు. కానీ ఈ రోజుల్లోఓ చిన్న పిల్లవాడు తన డ్యాన్స్‌తో అందరీనీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. గుజరాతీ పాటలో గర్బా స్టైల్‌లో డ్యాన్స్ చేస్తున్న చిన్నారి కనిపిస్తాడు. గర్బా అనేది గుజరాత్‌లోని ప్రసిద్ధ జానపద నృత్యం, ఇది గుజరాత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ, ఇందులో పిల్లలు పాడటం, డ్యాన్స్ చేయడం తరచుగా కనిపిస్తారు. కానీ ఈ వైరల్ వీడియోలో ఉన్నంత గొప్ప గా డ్యాన్స్ చేసే చిన్నారులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు.
ఓ చిన్నారి డ్యాన్స్ మాస్టర్లను తలపించే రీతిలో గర్భా నృత్యం చేస్తూ నడుము తిప్పుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. పాటలో బాగా ప్రావీణ్యం ఉన్న స్టెప్ బాయ్ స్టెప్పులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పిల్లవాడి డ్యాన్స్‌ను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వీడియో @Tiny_Dhillon అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది.కేవలం 1 నిమిషం 30 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటివరకు 33 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. చిన్నారి డ్యాన్స్ ను మెచ్చుకుంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.