Oo Antava Oo Oo Antava :అమెరికన్‌ వీధుల్లో ఊ అంటావా మామా, ఊహు అంటావా.. బాబోయ్ ‘పిల్ల’ మామూలు రచ్చ కాదు..!

పుష్పా సినిమా విడుదలై చాలా రోజులే అయినప్పటికీ ఇంకా ‘పుష్ప’ ఫీవర్ తగ్గడం లేదు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఫారిన్ అమ్మాయి ‘శ్రీవల్లి’ పాటకు

Oo Antava Oo Oo Antava :అమెరికన్‌ వీధుల్లో ఊ అంటావా మామా, ఊహు అంటావా.. బాబోయ్ ‘పిల్ల’ మామూలు రచ్చ కాదు..!
Srivalli Song
Follow us
Ganesh Mudavath

| Edited By: Ram Naramaneni

Updated on: May 27, 2022 | 8:22 PM

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది పుష్పా (Pushpa)..అల్లు అర్జున్‌ నటించిన ఈ మూవీ క్రేజ్ ఇంకా తగ్గడం లేదు. అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా ఇప్పటికీ దూసుకుపోతోంది. సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) సిగ్నేచర్ డైలాగ్ గుర్తుంది కదా… ‘తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ చేసిన పెర్ఫార్మన్స్ ఆడియ‌న్స్‌కు, బన్నీ అభిమానులకు బాగా నచ్చింది. సినిమాకు బోలెడు క్రేజ్ తెచ్చింది. మరోవైపు ఈ సినిమాలోని సాంగ్స్, హీరో మ్యానరిజం తెలుగు ప్రేక్షకులనే కాదు.. దేశ విదేశాలలోని అనేక మందిని ఆకర్షించాయి కూడా. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, క్రికెటర్లు.. వాళ్లు వీళ్లు అని తేడా లేదు అంతా పుష్ప సినిమాలోని సాంగ్స్ కు స్టెప్స్ వేస్తూ అలరిస్తున్నారు. ఇక అందులో సమంత ఐటమ్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎంతలా వైరల్ అయ్యిందో.. చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వారు కూడా హమ్ చేసిన పాట అది.. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఇప్పటికీ సందడి చేస్తోంది. తాజాగా యూఎస్‌లో ఓ 13ఏళ్ల చిన్నారి వయోలిన్‌ వాయిస్తూ ఊ అంటావా, ఊహు అంటావా..అంటూ కాలిఫోర్నియా వీధుల్లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడయోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పుష్పా సినిమా విడుదలై చాలా రోజులే అయినప్పటికీ ఇంకా ‘పుష్ప’ ఫీవర్ తగ్గడం లేదు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఫారిన్ అమ్మాయి ‘శ్రీవల్లి’ పాటకు సంబంధించిన మ్యూజిక్ ను వయోలిన్ మీద వాయించి, అందరినీ షాక్‌కు గురయ్యేలా చేసింది.

యూట్యూబ్‌లో 6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్ బేస్‌ను కలిగి ఉన్న 13 ఏళ్ల వయోలిన్ విద్వాంసురాలు కరోలినా ప్రొట్సెంకో ‘శ్రీవల్లి’ పాట వయోలిన్ వెర్షన్‌ను పోస్ట్ చేసి అల్లు అర్జున్ అభిమానులను, పుష్ప ప్రేమికులను ఆశ్చర్యపరిచింది. ఎక్కడో కాలిఫోర్నియాలో ఉన్న ఈ యువతి ‘శ్రీవల్లి’ పాటను ప్లే చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే హద్దులు దాటిన మన శ్రీవల్లి పాట ఈ పాప వవయోలియన్ తో మరింతగా ఫేమస్ అయ్యింది.

ఇవి కూడా చదవండి