చాక్లెట్‌లో పురుగులు..రూ. 50 లక్షలు పరిహారం కోరిన వ్యక్తి.. ఆసక్తికరమైన కోర్టు తీర్పు

చాక్లెట్స్‌ అంటే అందరికీ ఇష్టమే. పిల్లలకైతే ఇక చెప్పనక్కర్లేదు..అన్నం లేకపోయినా చాక్లెట్స్‌ తింటూ ఉండిపోతారు. వారికి నచ్చిన రుచులు, ఇష్టమైన ఫ్లేవర్స్‌తో అనేక రకాల చాక్లెట్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే,

చాక్లెట్‌లో పురుగులు..రూ. 50 లక్షలు పరిహారం కోరిన వ్యక్తి.. ఆసక్తికరమైన కోర్టు తీర్పు
Chocolate
Follow us
Jyothi Gadda

|

Updated on: May 27, 2022 | 7:18 PM

చాక్లెట్స్‌ అంటే అందరికీ ఇష్టమే. పిల్లలకైతే ఇక చెప్పనక్కర్లేదు..అన్నం లేకపోయినా చాక్లెట్స్‌ తింటూ ఉండిపోతారు. వారికి నచ్చిన రుచులు, ఇష్టమైన ఫ్లేవర్స్‌తో అనేక రకాల చాక్లెట్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే, అప్పుడప్పుడు చాక్లెట్స్‌ జనాన్ని షాక్‌ అయ్యేలా చేస్తుంటాయి. అప్పట్లో ఎక్కువ నట్స్‌ కలిగిన ఓ బ్రాండ్‌ చాక్లెట్స్‌పై అనేక విమర్శలు వచ్చాయి. వాటిల్లో పురుగులు ఉన్నాయంటూ కొందరు కస్టమర్లు కంప్లైట్‌ చేశారు. తాజాగా అలాంటిదే మరో ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. దాంతో చాక్లెట్‌ కొనుగోలు చేసిన సదరు వినియోగదారు ఏకంగా రూ.50లక్షల పరిహారం డిమాండ్‌ చేశారు.

బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్‌లో నివాసం ఉంటున్న ముఖేష్ కుమార్ కెడియా, 2016 అక్టోబర్‌లో స్థానిక ఎంకే రిటైల్ సూపర్ మార్కెట్‌లో క్యాడ్‌బరీ ఫ్రూట్, నట్ చాక్లెట్‌లను ఒక్కొక్కటి రూ.89 చొప్పున రెండు కొనుగోలు చేశాడు. అయితే ఒక చాక్లెట్‌ బార్‌లో పురుగులు ఉన్నట్లు గుర్తించాడు ముఖేష్ కుమార్‌. దాంతో క్యాడ్‌బరీ కస్టమర్ హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆ సిబ్బంది పురుగులున్న చాక్లెట్‌ను తిరిగి ఇవ్వాలని అడిగారు. అయితే దానికి నిరాకరించిన అతడు రుజువు కోసం ఫోటోలు పంపాడు. కాగా, తన ఫిర్యాదుపై క్యాడ్‌బరీ సంస్థ స్పందించకపోవడంతో 2016 అక్టోబర్‌ 26న బెంగళూరులోని అర్బన్‌ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. క్యాడ్‌బరీ చాక్లెట్‌ల తయారీ సంస్థ మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాణ్యతా విభాగం అధిపతితోపాటు కొనుగోలు చేసిన ఎంకే రిటైల్ బ్రాంచ్‌పై ‘సేవా లోపం’ కింద ఫిర్యాదు చేశాడు. రూ.89 విలువైన చాక్లెట్‌లో పురుగులు ఉండటంపై రూ.20 నుంచి రూ.50 లక్షల వరకు పరిహారం కోరాడు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఆ చాక్లెట్‌లో పురుగులున్న విషయాన్ని వినియోగదారుల కోర్టు అంగీకరించింది. అయితే ముఖేష్‌ కుమార్‌ డిమాండ్‌ చేస్తున్న అంత భారీ పరిహారం తమ పరిధిలోకి రాదని, రూ. 5లక్షల వరకు ఉన్న దరఖాస్తుల విచారణను మాత్రమే అనుమతిస్తుందని తేల్చి చెప్పింది. దీని కోసం రాష్ట్ర వినియోగదారుల కోర్టుకు వెళ్లాలని సూచించింది. రాష్ట్ర వినియోగదారుల కోర్టు రూ.1కోటి వరకు కేసులను అనుమతిస్తుంది. ఆరేళ్ల విచారణ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే