optical illusion: ఈ ఫొటోను అలాగే చూడండి.. మ్యాజిక్ అదిరిపోతుంది..
వీటిని ముఖ్యంగా మానసిక నిపుణులు ఉపయోగిస్తుంటారు. ఒక ఫొటోను చూపించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి.? మీరు ఒక సమస్యను ఎలా పరిష్కారిస్తాన్న విషయాలు అంచనా వేయొచ్చు. ఇక మరో రకమైన ఆప్టికల్ ఇల్యూజన్‌లో మీ ఐ పవర్‌ను పరీక్షించవచ్చు. చూసే కళ్లను మాయ చేసేలా ఉంటాయి. ఇలాంటి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే...
ప్రస్తుతం నెట్టింట ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫొటోలను నెటిజన్లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో పలు రకాలు ఉంటాయి. వీటిలో కొన్ని మనిషి ఆలోచనలను అంచనా వేసివి ఉంటాయి. ఇందులో మనం ఒక ఫొటోను చూసే విధానం ఆధారంగా మన క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పొచ్చు.
వీటిని ముఖ్యంగా మానసిక నిపుణులు ఉపయోగిస్తుంటారు. ఒక ఫొటోను చూపించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి.? మీరు ఒక సమస్యను ఎలా పరిష్కారిస్తాన్న విషయాలు అంచనా వేయొచ్చు. ఇక మరో రకమైన ఆప్టికల్ ఇల్యూజన్‌లో మీ ఐ పవర్‌ను పరీక్షించవచ్చు. చూసే కళ్లను మాయ చేసేలా ఉంటాయి. ఇలాంటి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
వైరల్ ఫొటో..
Stare at the image for about half a minute without moving your eyes and watch as it gradually disappears. This is a variation of #Troxler’s effect which essentially says that if you fixate your eyes on a certain point, stimuli near that point will gradually fade. pic.twitter.com/qjIrhKpO2V
— David McPhillips (@primaryeyecare1) March 12, 2018
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే రకరకాల రంగులు కనిపిస్తున్నాయి కదూ! అయితే అందులోనే అసలైన మ్యాజిక్ ఉంది. ఇందులోని ట్విస్ట్ కనిపించాలంటే ఒక అరనిమిషం పాటు ఫొటోను అలాగే గమనించండి. ఒక ఫొటోలో ఒక నిర్ధిష్ట స్థానంలో కళ్లను కేంద్రీకరించి ఫొటోను తీక్షణంగా చూడండి దీంతో కొద్ది సేపటికే ఫొటోలో ఉన్న రంగులన్నీ మాయమై తెల్ల పేపర్ కనిపిస్తుంది. ఇదే ఫొటోలో ఉన్న ప్రత్యేకత. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఫొటోను గమనించి థ్రిల్‌ను ఎంజాయ్ చేయండి.
ఇంతకీ ఈ ఫొటో మాయమైపోవడానికి కారణం చెప్పలేదు కదూ! దీనిని ట్రోక్స్‌లెర్స్ ఫేడింగ్ ఎఫెక్ట్‌గా పిలుస్తారు. నిర్ధిష్టంగా ఒక పాయింట్ వద్ద కేంద్రీకరించి చూసిన సమయంలో మెదడులో జరిగే మార్పుల కారణంగా ఇలాంటి భావన కలుగుతుంది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..