Viral Video: ఫోన్‌లో గేమ్ ఆడుకుంటున్న బాలుడు.. స్లోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత.. కట్ చేస్తే..
ఛార్జింగ్ పెట్టి మరీ గేమ్ ఆడుతున్నాడు ఆ బాలుడు. ఆటలో మునిగిపోయాడు. ఆ సమయంలో అనుకోని అతిథి చిరుతపులి ఎంట్రీ ఇచ్చింది. అయితే చిన్నోడు అరవలేదు. బెదరలేదు. చిరుత తనని చూడకపోవడంతో.. అది మరో గదిలోకి వెళ్లంత వరకు వెయిట్ చేశాడు. ఆపై బయటకు వచ్చి డోర్ వేసి.. గడియపెట్టాడు.
జీవితంలో చాలా హార్డ్ సిట్యువేషన్స్ వస్తాయి. అప్పుడు తత్తరపాటుకు గురవ్వకుండా.. కూల్‌గా హ్యాండిల్ చేస్తే.. ఆ సమస్యలు నుంచి బయటపడొచ్చు. అవును.. అలాంటి విషయాల్లో మీకు ఏమైనా క్లాస్ కావాలంటే ఈ కుర్రోడి వీడియో చూడండి.. తెలివి, సమయస్ఫూర్తి వంటి లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఈ కుర్రోడు.. ప్రాణాపాయ స్థితి నుంచి మంచినీళ్ల తాగినంత ఈజీగా బయటపడ్డాడు. మహారాష్ట్రలోని మాలెగావ్‌లో నివాసం ఉంటున్న ఈ బాలుడు.. తన ఇంట్లో.. కూర్చోని ఫోన్‌లో గేమ్ ఆడుతున్నాడు. ఆటలో మునిగిపోయాడు. ఈ క్రమంలో ఇంటి మెయిన్ డోర్ నుంచి అనుకోని గెస్ట్.. చిరుత పులి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ఎవరైనా అరుపు లంఖించుకుంటారు. కానీ ఈ చిన్నోడు సిట్యువేషన్‌ను చాలా కూల్‌గా హ్యాండిల్ చేశాడు.
చిరుతపులి తన ఇంట్లోకి ప్రవేశించడాన్ని చూసిన బాలుడు భయపడలేదు. అది ఇంట్లోని మరొక గదిలోకి ప్రవేశించే వరకు వేచి ఉన్నాడు. చిరుతపులి వేరే గదిలోకి వెళ్లిందని నిర్ధారించుకున్న తర్వాత.. నిశ్శబ్దంగా ఇంటి నుండి బయటకు వచ్చి తలుపు గడియపెట్టాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత.. ఇరుగు పొరుగు వారిని పిలిచి చిరుత ఇంట్లోకి ప్రవేశించిన విషయం చెప్పాడు. వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతకు మత్తు మందు ఇచ్చి బోనులో బంధించారు.
బాలుడు ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకున్నారు. నెటిజన్లు అయితే నువ్వు తోపు తమ్ముడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది కదా లైఫ్‌లో ఉండాల్సిన సమయస్ఫూర్తి అని మరొకరు పేర్కొన్నారు. ఏది ఏమైనా చిన్నోడు చిరుతను హ్యాండిల్ చేసిన విధానం మాత్రం అదుర్స్ అంతే. ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి…
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..