Kacha Badam Song: ట్రెండ్ అవుతున్న ‘కచ్చా బాదం’ సాంగ్.. ఆ పాట పాడింది ఎవరు..? ఎలా వైరల్ అయ్యింది!
Kacha Badam Song: సోషల్ మీడియాలో ఓ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. అదే 'కచ్చా బాదం'. ఎక్కాడ చూసినా ఈ సాంగ్ మార్మోగుతోంది. ఈ సాంగ్‌కు నెటిజన్లు, సెలబ్రేటీలు, పిల్లలు,..
Kacha Badam Song: సోషల్ మీడియాలో ఓ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. అదే ‘కచ్చా బాదం’. ఎక్కాడ చూసినా ఈ సాంగ్ మార్మోగుతోంది. ఈ సాంగ్‌కు నెటిజన్లు, సెలబ్రేటీలు, పిల్లలు, పెద్దలు సైతం డ్యాన్స్‌లు చేస్తూ సోషల్ మీడియా (Social Media)లో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ఆ పాటకు డాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ పాట రోజురోజుకు ట్రెండింగ్ అయిపోతుంది. సెలబ్రేటీలు వాహనాల్లో వెళ్తూ రోడ్డు పక్కన వాహనం నిలిపివేసి ఈ పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ సాంగ్‌కు ఇతర దేశస్థులు కూడా స్టెప్పులేస్తుండటం ఎంత వైరల్ అయ్యిందో ఇట్టే అర్థమైపోతుంది.
కచ్చా బాదం పాడింది ఎవరు..?
సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న సాంగ్ ‘కచ్చా బాదం’ ఈ పాటకు అసలు అర్థం ఏంటో తెలిసీ, తెలియని వారు కూడా డ్యాన్స్ చేస్తుండటంతో.. తెగ వైరల్ అయిపోయింది. కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు ఈ పాటను పాడింది ఎవరు..? అనేదాని గురించి నెటిజన్లు ఇంటర్నెల్‌లో సెర్చ్ చేస్తున్నారు. చివరికి కచ్చా బాదం సింగర్ పేరు బయటకు వచ్చింది. ఈ పాట పాడిన వ్యక్తి పేరు భువన్ బద్యాకర్ (Bhuban Badyakar). ఇతనిది పశ్చిమబెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా కురల్జూరి గ్రామం. కచ్చా బాదం అంటే.. బెంగాలీలో పచ్చివేరుశెనగ అని అర్థం. భువన్ బద్యాకర్ తన వేరుశెనగలను విక్రయించడానికి పాటలు పాడుతూ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటారు. ప్రజలు అతని శైలిని ఇష్టపడ్డారు. అతని పాటను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా వైరల్ అయ్యింది.
భువన్ బద్యాకర్ స్వయంగా ‘కచ్చా బాదం’ పాటను కంపోజ్ చేశాడు. బెంగాల్ గిరిజన బౌల్ జానపద పాట ఆధారంగా ఈ పాట రూపొందించబడింది. భువన్‌కు భార్య, ఇద్దరు కుమారులతో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. ఇతను వీధుల్లో తిరుగుతూ పచ్చి పల్లీలు అమ్ముతుంటాడు. మొబైల్స్ వంటి విరిగిన వస్తువులను కస్టమర్ల నుంచి తీసుకుని, వాటికి బదులుగా వేరుశెనగ అమ్ముతారు. రోజూ 3 నుంచి4 కిలోల వేరుశనగ అమ్ముతూ రూ.200-250 వరకు సంపాదిస్తున్నారు. ఇప్పుడు అతను పాడిన కచ్చా బాదం పాట విపరీతంగా వైరల్ కావడంతో.. వ్యాపారం కూడా వృద్ధి చెందిందని భుబన్ చెప్పుకొస్తున్నాడు.
Far better than so called influencers #KachaBadam #Original pic.twitter.com/kf1ssji3Ke
— AJ (@theamarjeet) February 8, 2022
భువన్ పాటకు జనాలు ఫిదా:
పచ్చి పల్లీలు అమ్ముతూ వీధుల్లో తిరుగుతూ పాడిన కచ్చా బాదం సాంగ్‌కు జనాలు ఫిదా అయ్యారు. ఇతను పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు ఈ పాటను అనుసరిస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. సింగపూర్, పోర్చుగీసు దేశస్థులు సైతం ఈ కచ్చా బాదం సాగుకు స్టెప్పులేశారు. అయితే భువన్ పాడిన పాట సినిమా ఇండస్ట్రీ వరకు చేరడంతో ఓ మ్యాజిక్ సంస్థ అతనితో ఓ ర్యాప్ సాంగ్ రూపొందింది. అవే లిరికల్స్‌కు ర్యాప్‌ను జోడించి భూవన్ వస్త్రధారణను మార్చేసి అతని పక్కన ఓ మోడ్రన్ అమ్మాయితో డ్యాన్స్ చేయించారు. యూట్యూబ్‌లో ఈ పాటు విడుదల కాగా, ఇప్పటి వరకు కోట్లాది మంది వీక్షించారు. ఈ పాట చేసినందుకు భువన్‌కు కొంత ఆర్థిక సాయం చేయడంతో ఆయన హర్షం వ్యక్తం చేశాడు. తాను గుడిసె లాంటి ఇంట్లో జీవిస్తున్నానని, ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు భువన్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి: