Watch Video: డీజే బ్రావో స్టైలే వేరు.. వికెట్ తీస్తే మైదానంలో తీన్మారే.. వైరల్ వీడియో
Dwayne Bravo: కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్(KKR vs CSK)పై విజయం సాధించి, బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో వికెట్ తీసుకున్న తర్వాత CSK ఆటగాడు డ్వేన్ బ్రావో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.
ఐపీఎల్-15(IPL 2022)లో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్(KKR vs CSK)పై విజయం సాధించి, బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో వికెట్ తీసుకున్న తర్వాత CSK ఆటగాడు డ్వేన్ బ్రావో(Dwayne Bravo) అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. 10వ ఓవర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రెండో దెబ్బ తగిలింది. డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో నితీష్ రాణా కొట్టిన బంతిని అంబటి రాయుడు క్యాచ్ అందుకున్నాడు. ఈ సమయంలో బ్రావో తాజాగా విడుదల చేసిన నంబర్ వన్ అనే పాటకు స్టెప్పులు వేస్తూ కనిపించాడు. అలాగే వెంకటేష్ అయ్యర్‌ను కూడా అవుట్ చేసి అదే విధంగా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు.
బ్రావో ‘నెంబర్ వన్’ పాట విడుదల..
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్ ప్రారంభానికి ముందు తన కొత్త పాట నంబర్ వన్ ను విడుదల చేశాడు. కోలిన్ వెడర్‌బర్న్‌తో కలిసి బ్రావో ఈ పాటను రాశారు. బ్రేవో మాట్లాడుతూ, ‘ఈ పాట నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది, డ్యాన్స్ మాత్రమే నంబర్ కాదు.. ఈ పాట లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. భారతదేశంలో ఈ పాటను విడుదల చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నా అభిమానులకు బాగా నచ్చుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో..
చెన్నై తరపున బ్రావో మూడు వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో మిచెల్ సాంట్నర్‌కు ఒక వికెట్ దక్కింది. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన లసిత్ మలింగ రికార్డును బ్రావో సమం చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి పేరు మీద 170 వికెట్లు ఉన్నాయి. అమిత్ మిశ్రా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టీమిండియా బౌలర్ ఐపీఎల్ కెరీర్‌లో 166 వికెట్లు తీశాడు.
6 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం..
IPL 2022 మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై తరపున మహేంద్ర సింగ్ ధోని అజేయంగా 50 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ తరపున అజింక్యా రహానే 44 పరుగులు చేశాడు.
Match 1: WICKET! ? ?. Venkatesh Iyer c MS Dhoni b Dwayne Bravo 16 (16b). Kolkata Knight Riders 43/1 (6.2 Ovs). pic.twitter.com/9fQRW5mRRK
— Cricket Master Updater (@MohsinM55415496) March 26, 2022
MI vs DC IPL 2022 Head to Head: రోహిత్ వర్సెస్ రిషబ్.. పైచేయి ఎవరిది.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?