Viral Video: ఇది జలపాతం అనుకునేరు.. కానే కాదు.. వీడియో చూస్తే ఒళ్లు షేకాడాల్సిందే..

ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లపై మొకాలలోతు నీరు నిలిచిపోవడంతో ముంబై ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటిలో ప్రయాణం ముందకు సాగడం లేదు. పలు ప్రాంతాల్లో కార్లు ,బైకులు నీళ్లలో మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.

Viral Video: ఇది జలపాతం అనుకునేరు.. కానే కాదు.. వీడియో చూస్తే ఒళ్లు షేకాడాల్సిందే..
Raigad Fort
Follow us

|

Updated on: Jul 08, 2024 | 4:11 PM

మహారాష్ట్రను జలప్రళయం అతలాకుతలం చేస్తోంది.. ఒక్క రోజు వర్షానికే ముంబై, రాయ్‌గఢ్ లాంటి నగరాలు అల్లాడిపోతున్నాయి.. ముఖ్యంగా ముంబైలో 6 గంటల్లో ఏకంగా 30 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద నీరు రోడ్ల మీద ప్రవహిస్తోంది. వీధులు, కాలనీలు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లపై మొకాలలోతు నీరు నిలిచిపోవడంతో ముంబై ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటిలో ప్రయాణం ముందకు సాగడం లేదు. పలు ప్రాంతాల్లో కార్లు ,బైకులు నీళ్లలో మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ర్టలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ముంబైలో ఎక్కడ చూసినా రోడ్లపై వరద నీరు కనిపిస్తోంది. సబ్‌ వేలలోకి కూడా భారీగా వర్షపు నీరు చేరగా అవి పూర్తిగా జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ముంబయిలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సెలవు ప్రకటించింది. రోడ్ల నుండి రైలు పట్టాల వరకు అన్ని చోట్లా నీరు నిల్వ ఉంది. రైలు పట్టాలపై భారీగా నీరు, మట్టి చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ముంబై మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. మరోవైపు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

రాయ్‌గఢ్ ఫోర్ట్ ను సైతం వరదలు చుట్టుముట్టాయి.. ఒక్కసారిగా వరదలు రావడంతో అక్కడకు వెళ్లిన పర్యాటకులు అక్కడ చిక్కుకపోయారు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. అక్కడే ఉన్నట్లు సమాచారం.. ఫోర్ట్ ప్రాంతాల్లో కుండపోత వర్షాల నేపథ్యంలో 30 మందికి పైగా పర్యాటకులు అక్కడ చిక్కుకున్నట్లు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.. పర్యాటకులు జలపాతాన్ని పోలిన నీటి ప్రవాహం మధ్య రెయిలింగ్‌లు, మెట్లను పట్టుకుని కనిపిస్తున్నారు. అయితే.. కొందరిని అక్కడున్న వారు రక్షించారు.

రాయగఢ్ కోట వద్ద చిక్కుకుపోయిన పర్యాటకులు.. వీడియో..

అక్కడ చిక్కుకున్న వ్యక్తులను తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫారెస్ట్ ప్రాంతంలోని కోటను చేరుకోవడానికి ఉపయోగించే దర్వాజా మార్గాలను మూసివేశారు. రాయ్‌గఢ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, అధికారులు ఈరోజు నుంచి రాయ్‌ఘడ్ కోటను మూసివేశారు. ఎడతెరపిలేని వర్షాల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని పేర్కొంటున్నారు.

మరో రెండు రోజులపాటు ముంబై మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేశారు. ముంబై, థానే, పాల్ఘర్‌, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..