AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: క్రేజీ ఫెల్లో.. రాఖీ పండుగ కోసం టిండర్‌ యాప్‌లో చెల్లెళ్లను వెతుక్కున్నాడు

టిండర్‌లో అందరూ డేటింగ్ చేయడానికి పార్టనర్స్‌ని వెతుక్కుంటారు. కానీ ఇతడు మాత్రం రాఖీ కట్టేందుకు చెల్లెళ్లను వెతుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

Viral: క్రేజీ ఫెల్లో.. రాఖీ పండుగ కోసం టిండర్‌ యాప్‌లో చెల్లెళ్లను వెతుక్కున్నాడు
Crazy Fellow
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2022 | 6:48 PM

Share

Social Media: ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సిస్ అందరికీ దొరకుతుంది. దీంతో పనులన్నీ ఈజీ అయిపోయాయి. ఎక్కడో విదేశాల్లో ఉన్నవారితో సైతం పక్కన్న కూర్చున్న వక్తులతో మాట్లాడినట్లు పిచ్చాపాటి మాట్లాడవచ్చు. ఈ మధ్య కాలంలో అన్నీ ఆన్‌లైన్‌లోనే. ఫ్రెండ్స్ అక్కడే దొరకుతారు. ప్రేమలో అక్కడే పడతారు. ఇంకా ఈ కరోనా పుణ్యమా అని పెళ్లిళ్లు కూడా ఆన్‌లైన్‌లోనే దాఖలాలు చూశాం. ఇక కుప్పులు తెప్పులుగా డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో టిండర్(Tinder) గురించి చాలామందికి తెలుసు. ఈ యాప్‌ను రూరల్ ఏరియాల్లో ఉన్న యూత్ సైతం యూజ్ చేస్తున్నారు. ఈ యాప్ వేదికగా తమకు యాప్ట్ అయ్యే పార్టనర్స్ కోసం వెతుక్కుంటున్నారు. మామలుగా అయితే ఇందులో భాగస్వాములను వెతుక్కుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం అక్కలు, చెల్లెళ్ల కోసం సెర్చ్ మొదటెట్టాడు. అందులో కూడా సఫలీకృతం అయ్యాడు. ఈ శుక్రవారం(ఆగష్టు12)న రాఖీ పండుగ(Rakhi Festival) అన్న విషయం తెలిసిందే. దీంతో సోదరీమణులు లేని ఆ యువకుడు.. విచిత్రంగా టిండర్ వేదికగా సెర్చింగ్ షురూ చేశాడు. అనుకోకుండా అతనికి ఇద్దరు సోదరీమణులు కూడా అక్కడ దొరికేశారు. దీంతో గ్రాండ్‌గా రాఖీ పండుగ జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సంవత్సరం తనకు టిండర్‌లో ఇద్దరు సిస్టర్స్ దొరికారని వెల్లడించాడు. దీంతో పండుగ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన టిండర్‌ యాజమాన్యానికి కూడా ధన్యావాదాలు తెలిపాడు. దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా