AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వలకు చేప చిక్కింది.. జాలరి పంట పండింది.. నెట్టింట వైరల్ గా మస్కీ ఫిష్

మత్స్యకారులు చేపల వేటకు సముద్రానికి వెళ్లినప్పుడు వారికి రకరకాల చేపలు చిక్కుతాయి. కొన్నిసార్లు వారు ఊహించని విధంగా పెద్దపెద్ద చేపలు, అరుదైన మత్స్యాలు, ఔషధ గుణాలు కలిగిన మీనాలు వలలో పడుతుంటాయి. అలాంటి చేపలు...

Viral: వలకు చేప చిక్కింది.. జాలరి పంట పండింది.. నెట్టింట వైరల్ గా మస్కీ ఫిష్
Muski Fish
Ganesh Mudavath
|

Updated on: Aug 03, 2022 | 11:01 AM

Share

మత్స్యకారులు చేపల వేటకు సముద్రానికి వెళ్లినప్పుడు వారికి రకరకాల చేపలు చిక్కుతాయి. కొన్నిసార్లు వారు ఊహించని విధంగా పెద్దపెద్ద చేపలు, అరుదైన మత్స్యాలు, ఔషధ గుణాలు కలిగిన మీనాలు వలలో పడుతుంటాయి. అలాంటి చేపలు జాలర్లకు దొరికితే వారి పంట పండినట్లే.. అరుదుగా లభించే చేపలు అధిక ధర పలుకుతుంటాయి. దాంతో మత్య్సకారులు ఆనందానికి అవధులుండవు. తాజాగా అమెరికాలో ఓ జాలరి వలకు అలాంటి చేప ఒకటి చిక్కింది. అమెరికాకు చెందిన ఓ జాలరి చేపలు పట్టేందుకు వెళ్లాడు. అతని వలకు పెద్ద చేప చిక్కింది. ఈ చేప కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ చేపను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ చేప వార్త ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. జాలరి తన చేతులతో పట్టుకున్న చేప ఫొటోను షేర్ చేశాడు. ఈ పోస్ట్ కు ‘వేసవిలో చేపల వేట ఎలా కొనసాగుతుంది’ అనే కాప్షన్‌ను ఇచ్చారు.

టైగర్‌ మస్కీ అనే పేరుగల చేపను షేర్‌ చేసిన జాలరి జో రివాస్‌కు ధన్యవాదాలు అంటూ ఫొటో కింద రాశారు. ఈ టైగర్‌ మస్కీ అనే చేప.. ఉత్తర పైక్‌-మస్కెలుంజ్‌ క్రాస్‌ బ్రీడ్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. ఈ చేప దాదాపు 42 అంగుళాల పొడవు ఉంది. ఇలాంటి క్రాస్‌ బ్రీడ్‌ చేపలు చాలా అరుదుగా ఉంటాయని వాషింగ్టన్‌లోని ఫిష్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ విభాగం అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us