AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పొట్టకూటి కోసం ఈకార్మికుడి కష్టం చూస్తే.. కన్నీళ్లు పెట్టుకోవల్సిందే..

జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తే ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ఇలాంటివి చూడాల్సి వస్తుందా అనే బాధ కలుగుతుంది. ఎవరూ ఎంత కష్టపడినా పొట్టకూటి కోసమే.. కొంతమంది ఎంత కష్టపడినా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మారుతున్న కాలం..

Viral Video: పొట్టకూటి కోసం ఈకార్మికుడి కష్టం చూస్తే.. కన్నీళ్లు పెట్టుకోవల్సిందే..
Rickshaw Puller
Amarnadh Daneti
|

Updated on: Aug 25, 2022 | 6:40 PM

Share

Viral News: జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తే ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ఇలాంటివి చూడాల్సి వస్తుందా అనే బాధ కలుగుతుంది. ఎవరూ ఎంత కష్టపడినా పొట్టకూటి కోసమే.. కొంతమంది ఎంత కష్టపడినా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మారుతున్న కాలం.. పెరుగుతున్న ఖర్చులతో సామాన్య మానవుడు బతుకుబండిని ఈడ్చటం చాలా కష్టమే. అయినా ఏదో ఒక కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవడం చూస్తుంటాం. పేద ప్రజల జీవనంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాయి. కొన్ని సంఘటనలు చూసి ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరడం లేదా అనే అనుమానాలు కలుగుతాయి. ఏది ఏమైనప్పటికి కుటుంబ పోషణ కోసం వ్యక్తి పడే తపన అంతా ఇంతా కాదు. ఇలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్ లో అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

తన బతుకుబండిని ఈడ్చటం కోసం ఓ రిక్షా కార్మికుడు తన ఏడాదిలోపు పిల్లాడిని భుజం మీద వేసుకుని.. ఓ చేత్తో బిడ్డని, మరో చేత్తో రిక్షా తొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను ఇంటినుంచి బయలేదేరేటప్పుడు తన కుమారుడిని భుజం మీద వేసుకుని ప్రయాణీకుల కోసం మధ్యప్రదేశ్‌ లోని జబల్ పూర్ నగరంలో తిరుగుతున్నాడు. రాజేష్ అనే వ్యక్తిని పాలు తాగే తన కొడుకుని ఒక్కడిని ఇంట్లో వదలలేక.. తనతో పాటు తీసుకొస్తున్నాడు. ప్రయాణీకులను ఎక్కించుకుని రిక్షా నడుపుతున్నప్పుడు రాజేష్ ఒక చేతితో తన బిడ్డను, మరో చేతితో రిక్షా హ్యాండిల్ పట్టుకుని రైడ్ చేయడం అందరి కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈవీడియో చూసిన వారంతా కుటుంబ పోషణ కోసం ఇలా కష్టాపడాల్సి రావడం చూస్తుంటే ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు వీరికి అందడం లేదా అనే సందేహాలు కలిగిస్తున్నాయి. ఏడాదిలోపు కుమారుడికి ఒంటి మీద దుస్తులు లేకుండా తనతో తిప్పుకుంటున్న పరిస్థితిని చూస్తుంటే రాజేష్ పేదరికంతో పాటు.. ఎంతో పురోగతి చెందుతున్న ఈసమాజంలో ఇలాంటి పరిస్థితులేమిటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు ఇలాంటివారికి చేరాలంటూ ఈవీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..