AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thirsty Crow కథ నిజమైంది..! బాటిల్‌లో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి.. వీడియో వైరల్‌..

నీ, ఇప్పుడు ఆ కథను నిజం చేస్తూ.. ఒక కాకి కెమెరాకు చిక్కింది.  బాటిల్‌లో అడుగునున్న నీటిని పైకి తెచ్చేందుకు గులకరాళ్ళను ఒక్కొక్కటిగా బాటిల్‌లో నింపడానికి ప్రయత్నిస్తోంది. చిన్నప్పుడు చదువుకున్న అదే థర్ట్సీ క్రో.. స్టోరీని నిజం చేస్తూ..ట్విట్టర్‌లో ఒక వీడియో వైరల్‌గా మారింది.

Thirsty Crow కథ నిజమైంది..! బాటిల్‌లో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి.. వీడియో వైరల్‌..
Thirsty Crow
Jyothi Gadda
|

Updated on: Apr 04, 2023 | 9:34 PM

Share

దాహంతో ఉన్న కాకి’ లేదా Thirsty Crow.. కథ గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు పాఠ్యాంశంగా చదువుకున్నదే. దాహంతో ఉన్న కాకి ఒకటి నీళ్ల కోసం అడవంతా గాలిస్తుంది.. దానికి ఎక్కడా చుక్క నీరు దొరకలేదు. కానీ, అదృష్టవశాత్తు ఒక కుండలో నీళ్లు కనిపించాయి. కానీ, కుండ అడుగున ఉన్న నీటిని  ఆ కాకి తాగలేకపోతుంది.. దాంతో చాకచక్యంగా ఆలోచించిన ఆ కాకి..ఒక్కో రాయి కుండలో వేయడం మొదలుపెట్టింది. చివరికి.. రాళ్ల బరువుతో కుండలో నీరు పైకి వచ్చాయి. అప్పుడు ఇక హాయిగా నీటిని తాగి కాకి తన దాహాన్ని తీర్చుకుంది.

చురుకైన తెలివితేటలతో కాకి తన దాహాన్ని తీర్చుకున్న అద్వితీయ కథ చిన్నప్పుడు మనందరం చదువున్నదే. కాకి ఎంత తెలివైనదో అప్పుడు పాఠ్యాపుస్తకంలో చదువుకున్నాం.. కానీ, ఇప్పుడు ఆ కథను నిజం చేస్తూ.. ఒక కాకి కెమెరాకు చిక్కింది.  బాటిల్‌లో అడుగునున్న నీటిని పైకి తెచ్చేందుకు గులకరాళ్ళను ఒక్కొక్కటిగా బాటిల్‌లో నింపడానికి ప్రయత్నిస్తోంది. చిన్నప్పుడు చదువుకున్న అదే థర్ట్సీ క్రో.. స్టోరీని నిజం చేస్తూ..ట్విట్టర్‌లో ఒక వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను @TansuYegen అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కాకులు ఎంత తెలివిగా ఉంటాయో ఈ వీడియో చూపిస్తుంది. వేసవి తాపంతో ఉన్న కాకి..అక్కడ కనిపించిన బాటిల్‌లోని నీటిని తాగేందుకు విశ్వప్రయత్నం చేసింది. ఆ సీసాలో నీరు ఉంది, కానీ కాకి తాగడానికి వీలు లేకుండా నీరు అడుగువరకే ఉంది. దాంతో నీళ్ల సీసాలో రాళ్లు వేసి అడుగున ఉన్న నీటిని పైకి తెచ్చేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు పైకి వచ్చిన నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏప్రిల్ 2న షేర్ చేసిన వీడియోకి 43.4 లక్షల మంది వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..