పండగల సీజన్ వచ్చింది.. ఇదే దొంగలకు అనువైన టైమ్..పండగ వేళ సాధారణంగానే పట్టణ ప్రజలంతా వారి వారి సొంత గ్రామాలకు వెళ్తుంటారు. ఇదే అదునుగా దొంగలు తెగబడుతుంటారు. అందుకే స్థానికులు పోలీసులు ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటారు. కానీ, దొంగలు కేవలం ఇళ్లు, గుళ్లు, దుకాణాలు, బ్యాంకులు మాత్రమే కాదు.. కలిసివస్తే.. పాలు, పెరుగు కూడా వదలకుండా లూటీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో పాల దొంగలు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జరిగిన పాల చోరీకి సంబంధించి ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ శివారులోని మేడ్చల్ – రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డెయిరీ నుంచి కొన్ని రోజులుగా పాల ప్యాకెట్లు చోరీకి గురైతున్నట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన యజమాని సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. దాంతో దొంగ పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
ఇదిలా ఉంటే, దసరా సెలవుల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లే దొంగల టార్గెట్ అంటున్నారు పోలీసులు. రాత్రి సమయాల్లో ఎవ్వరికీ కనిపించకుండా దొంగలు రెచ్చిపోతుంటారు. పగటి పూట రెక్కీ చేసి సందు దొరికితే చాలు ఇళ్లను దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి