Viral: లవ్ మంత్రం.! అమ్మాయిలూ అబ్బాయిలు ఈ తప్పులు చేస్తే.. ఇక అంతే
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. ఓ అద్భుత మధురానుభూతి. ఒకప్పుడు ప్రేమ అంటే నమ్మకం, బలం.. కానీ ప్రస్తుతకాలంలో ప్రేమకు ఎలాంటి వారంటీ, గ్యారెంటీ లేదు. చిన్న చిన్న తప్పులే ఈ మధ్య రిలేషన్‌షిప్ బ్రేకప్ కావడానికి కారణాలు అవుతున్నాయ్.
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. ఓ అద్భుత మధురానుభూతి. ఒకప్పుడు ప్రేమ అంటే నమ్మకం, బలం.. కానీ ప్రస్తుతకాలంలో ప్రేమకు ఎలాంటి వారంటీ, గ్యారెంటీ లేదు. చిన్న చిన్న తప్పులే ఈ మధ్య రిలేషన్‌షిప్ బ్రేకప్ కావడానికి కారణాలు అవుతున్నాయ్. మరి అలాంటప్పుడు అమ్మాయిలూ, అబ్బాయిలు పాటించాల్సిన ఆ లవ్ మంత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
మాజీ ప్రేయసిని గుర్తుచేసుకోవడం..
ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు.. ఆ రిలేషన్‌లో ఎప్పుడూ కూడా మాజీ ప్రేయసి టాపిక్‌ను తీసుకురావద్దు. అలాగే ఎక్స్-లవర్‌తో మీ గర్ల్‌ఫ్రెండ్‌ను పోల్చడం కూడా ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతాయి. మీ ప్రేమ మధ్య వీలైనంత వరకు ఫస్ట్ లవ్ లేదా మాజీ ప్రేయసి విషయాలను తీసుకురావడం మంచిది కాదు.
కుటుంబం ముఖ్యమా.. నేను ముఖ్యమా..
మీ గర్ల్‌ఫ్రెండ్‌కు ఛాయిస్ ఇవ్వకండి. నేనా లేక కుటుంబమా.. అనే ఛాయిస్ ఇవ్వకూడదు. అమ్మాయికి.. మీతో పాటు స్నేహితులు, కుటుంబం ఇలా చాలానే ఉంటాయి. మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ, వేరేవాళ్లకు ఇవ్వాల్సిన ప్రయారిటీ.. అన్ని కూడా ఆమె సమతుల్యంగా చూసుకుంటుంది. అందుకే ఇలాంటి డౌట్స్ మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెగదెంపులు అయ్యేలా చేస్తుంది.
గొడవపడిన ప్రతీసారి బ్యాడ్ వర్డ్స్ ఉపయోగించొద్దు..
ఏ రిలేషన్‌లోనైనా తగాదాలు అనేవి సహజం. ఇద్దరూ పోట్లాడుకునేటప్పుడు మీరు మాట్లాడే మాటలు, పదాలపై శ్రద్ధ వహించడం మంచిది. గొడవపడేటప్పుడు.. “నోరు మూసుకో” లేదా “ఇప్పుడే వెళ్లిపో” అనడం కరెక్ట్ కాదు. ఈ మాటలు ఎదుటి వ్యక్తిని బాధిస్తాయి. కొన్నిసార్లు ఈ విషయాలను మీ గర్ల్‌ఫ్రెండ్ సీరియస్‌గా తీసుకుంటే.. బంధం అటకెక్కినట్టే.
గర్ల్‌ఫ్రెండ్ స్నేహితుల గురించి తెలుసుకోవాలనుకోవడం..
బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మధ్య మాట్లాడటానికి చాలానే టాపిక్స్ ఉంటాయి. ఒకరి స్నేహితుల గురించి మరొకరు తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఒకరి అభిరుచి మరొకరికి అనుమానం కలిగించవచ్చు. గర్ల్‌ఫ్రెండ్ ఎప్పుడూ కూడా తనవాడు.. తన చుట్టూనే ఉండాలని అనుకుంటుంది. తనపైనే ప్రేమ చూపించాలని ఆశిస్తుంది. మీరు ఎక్కువగా తన దగ్గర.. ఆమె ఫ్రెండ్స్ టాపిక్ తీసుకొస్తే.. బ్రేకప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.