Eye Test: ఎక్కడుంది.. ఎక్కడుంది.. ఆ పాము.. అక్కడే నక్కినాది.. మీరు కనిపెట్టగలరా..?
ఫోటో పజిల్స్ అనేవి మనకు కాస్త టైమ్ పాస్ మాత్రమే కాదు. మీ బుర్రను కూడా యాక్టివ్ చేస్తాయి. అందుకే ఇవి ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. మీ కోసం మాంచి పజిల్.
ఇది ఉరుకులు.. పరుగుల కాలం. చాలామంది విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. హెక్టిక్ షెడ్యూల్స్ మధ్య కాస్తంత రిలాక్సేషన్, ఆటవిడుపు అవసరం. బాడీతో పాటు బుర్ర కూడా రిలాక్స్ అయితేనే.. మనం యాక్టివ్‌గా ఉండగలం. ఇక పని ఒత్తిడి నుంచి బయట పడేందుకు కొందరు పాటలు వింటారు. ఇంకొందరు ఇన్ స్టా రీల్స్ చూస్తారు. మరికొందరు ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో పజిల్స్‌ను సాల్వ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. వీటిపై ఈ మధ్య నెటిజన్స్ ఇంట్రస్ట్ బాగా పెరిగింది. సుడోకోలు, వీకెండ్ బుక్స్‌లో వచ్చే పద సంపత్తికి సంబంధించిన పజిల్స్ ఒక రకం. కానీ.. ఫోటో పజిల్స్‌తో అంత ఈజీ కాదు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు ఉండి మనల్ని తికమికపెడతాయి. మనతో ఉల్టా గేమ్ ఆడేస్తాయి. అలాంటి ఓ ఖతర్నాక్ పజిల్ మీ కోసం తీసుకువచ్చాం.
పైన ఇచ్చిన ఫోటోను బాగా అబ్జర్వ్ చేశారా.? చూసిన వెంటనే.. చెట్ల పొదలు.. ఆ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉన్నది అని చెబుతారు. అక్కడే ఓ పాము కూడా ఉంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. కొంచెం ఫోకస్ పెడితే ఈజీగానే దాని ఆచూకి పట్టవచ్చు. ఏదో నామ్ కే వాస్త చూస్తే మాత్రం అది మీకు చిక్కదు. ఇంకెందుకు ఆలస్యం.. పజిల్ సాల్వ్ చేసి తోపు అనిపించుకోండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే దిగువన ఫోటో చూసెయ్యండి.
మరిన్నిట్రెండింగ్ వార్తల కోసం