Viral Video: స్టంట్ చేయాలనుకుంటే మోకాళ్లు పగిలాయి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియా ప్రపంచం ఓ అద్భుతం. ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో సంచలనంగా మారేందుకు చిత్ర.. విచిత్రాలు చేసేందుకు తెగ ట్రై చేస్తుంటారు.
సోషల్ మీడియా ప్రపంచం ఓ అద్భుతం. ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో సంచలనంగా మారేందుకు చిత్ర.. విచిత్రాలు చేసేందుకు తెగ ట్రై చేస్తుంటారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను తెగ వాడేసకుంటారు. కొంతమంది తమ వీడియోలు, ఫోటోలకు లైక్‌లు.. కామెంట్‌లు పొందడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి వెనుకాడరు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. ఓ బాలుడు సైకిల్‌పై స్టంట్ చేసే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వీడియో చూసిన తర్వాత, మీరు కూడా హీరోపంటీ అంతా పోయిందని అంటున్నారు.
ఒక్కో స్టంట్ ఒక్కో విధంగా ఉంటుందని మనందరికీ తెలిసిందే. ప్రొఫెషనల్ స్టంట్స్ చేయడానికి చాలా కష్టపడతారు. ఆ స్టంట్‌లో ఎక్కడో పర్ఫెక్షన్ వస్తుంది. ప్రజలు కూడా దాన్ని చూసి ఆనందిస్తారు. అయితే ఇలాంటివి చేస్తున్నప్పుడు జరిగే పొరపాట్లు ప్రమాదాలకు కారణంగా మారుతాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా అలాంటిదే ఒకటి జరిగింది.
ఖాళీగా ఉన్న రోడ్డులో ఒక వ్యక్తి సైకిల్‌పై విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. మొదట సైకిల్‌పై విన్యాసాలు చేయడానికి ప్రయత్నించడం.. కానీ అతని బ్యాలెన్స్ దెబ్బతినడంతో అతను ఒక్కసారిగా పడిపోతాడు. అదృష్టవశాత్తూ అటువైపు నుంచి వస్తున్న వాహనం పక్కనే పడకపోవడంతో ప్రాణాలు కోల్పోయే అవకాశం నుంచి తప్పించుకుంటాడు. సరదాగా చేసే ఇలాంటి స్టంట్స్ పెద్ద ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంటుంది.
ఈ వీడియో చూడండి
View this post on Instagram
ఈ ఫన్నీ వీడియోను గెల్డెగుల్మీ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి ఇప్పటివరకు 80 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది ఆ అతను చేసిన పనిని విమర్శించారు. ఇలాంటి విన్యాసాలు చేసే ముందు వందసార్లు ఆలోచించాలని అంటున్నారు నెటిజనం. అదే సమయంలో, ‘ ప్రధాన రహదారిపై మనం ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయకూడదు’ అని మరొక యూజర్ సలహా ఇచ్చాడు. మరొక వినియోగదారు ‘Awwwwww పర్వాలేదు, లేచి మళ్లీ చేయండి’ అని వ్యాఖ్యానించగా. అదేవిధంగా, మరొక వినియోగదారు కూడా వ్యాఖ్యానిస్తూ, చింతించకండి, ఇది మంచి ప్రయత్నం అని అన్నారు.
ఇవి కూడా చదవండి: Capsule Two Colors: క్యాప్సూల్‌కు రెండు రంగులు ఎందుకుంటాయో తెలుసా.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..
Job Promotion Tips: ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్ పొందాలనుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..