AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ముందుకే రైలు.. రూ.113 కోట్ల ప్రైవేట్ స్టేషన్‌తో రాంపూర్ నవాబు అద్భుత రాజసం!

అభిరుచులు చాలా ముఖ్యమైనవని అంటారు. అభిరుచులు, సంపదను పొగుచేసే క్రమంలో ప్రజలు చాలామంది ఊహించలేని పనులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సొంతంగా రైలును కలిగి ఉన్న ఒక రాజు అతను ఒక నవాబు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? అంతేకాదు, ఆయన తన ఇంటి ముంగిట నుంచే రైలు మార్గాన్ని కూడా వేయించుకున్నాడు. అంతటి మహా రాజు గురించిన వివరాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ మీకు అతని గురించి తెలియకపోతే, ఈ కథనంలొ అతని గురించి తెలుసుకోండి.

ఇంటి ముందుకే రైలు.. రూ.113 కోట్ల ప్రైవేట్ స్టేషన్‌తో రాంపూర్ నవాబు అద్భుత రాజసం!
Nawab Hamid Ali Khan
Jyothi Gadda
|

Updated on: May 13, 2026 | 11:08 AM

Share

ఈ ప్రపంచం ఎందరో గొప్ప రాజులను, నవాబులను చూసింది. వారి కథలు ఇప్పటికీ పుస్తకాలలో బోధించబడుతున్నాయి. అంతేకాకుండా, కొందరు రాజులు, నవాబుల వైభవం గురించి ఎల్లప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక నవాబు గురించి తెలిస్తే షాక్‌ అవుతారు. అతను తన సంపదతో అత్యంత ధనవంతుడికి గుర్తింపు పొందాడు. అతన తన ఇంటి ముంగిటకే రైలు మార్గాన్ని వేయించుకున్నాడు. అంతేకాదు, అతనికి సొంత రైలు, రైల్వే స్టేషన్ కూడా ఉండేవి.

మనం మాట్లాడుకుంటున్న నవాబు ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ సంస్థానానికి చెందిన నవాబు హమీద్ అలీ ఖాన్. ఆయన వైభవం ఎంత గొప్పదంటే, ఆయన రాజభవమైన ఖాస్ బాగ్ లోపలే రైల్వే ట్రాక్‌లను వేశారు. అతని డ్రాయింగ్ రూమ్‌కు సమీపంలో ఉన్న అతని ప్రైవేట్ స్టేషన్‌కు రైలు నేరుగా వచ్చేది. కాబట్టి, అతనికి కారు గానీ, బగ్గీ గానీ అవసరం ఉండేది కాదని చెబుతారు. ఆ సమయంలో రైల్వే లైన్, స్టేషన్ నిర్మాణానికి అయిన ఖర్చు నేటి లెక్కల ప్రకారం సుమారు 113 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. నవాబ్ సాహిబ్ మిలక్ నుండి రాంపూర్ వరకు సుమారు 40 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక రైల్వే లైన్‌ను వేయించారు.

ఇవి కూడా చదవండి

1925లో నవాబు తన కోసం ది సలూన్ అనే పేరుతో ఒక ప్రత్యేక రాజ రైలును నిర్మించుకున్నారు. ఆ రైలు కేవలం ఒక లోహపు బోగీ కాదు, పట్టాలపై కదిలే ఒక రాజభవనంలా ఉండేది. అది ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కి ఏ మాత్రం తక్కువ కాదు. ఆ బోగీలను పర్షియన్ తివాచీలు, మెరిసే షాండిలియర్లు, చెక్కిన ఫర్నిచర్, విశాలమైన గదులతో అలంకరించారు. ప్రయాణ సమయంలో కూడా రాజరికపు అనుభూతిని కొనసాగించేలా ప్రతి బోగీని ప్రత్యేకంగా రూపొందించారు. ఒక రైలు ఇంత విలాసవంతంగా ఉండగలదని చూస్తున్నవారు ఆశ్చర్యపోయారు.

ఈ ప్రైవేట్ రైలులో నవాబు కోసం ప్రత్యేకంగా రూపొందించిన కోచ్‌లు ఉండేవి. ఇందులో విలాసవంతమైన బెడ్‌రూమ్‌లు, డైనింగ్ హాల్స్, ఇతర రాజరిక వసతులు ఉండేవి. కేవలం నవాబు, ఆయన కుటుంబ సభ్యులు, ప్రత్యేక అతిథులు మాత్రమే ఈ రైలులో ప్రయాణించేవారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఈ ప్రైవేట్ రైలు ప్యాలెస్ నుండి బయలుదేరి ప్రధాన రైల్వే నెట్‌వర్క్‌లో కలిసేది. ఈ రైలు మార్గం ఆయన రాజభవనాన్ని ప్రధాన రైలు నెట్‌వర్క్‌కు అనుసంధానించింది. నవాబ్ సాహిబ్ ప్రయాణం నుండి బయలుదేరినా లేదా తిరిగి వచ్చినా, రైలు నేరుగా రాజభవన ప్రాంగణంలోకి ప్రవేశించేది.

భారతదేశంలో సొంతంగా ప్యాలెస్ లోపల రైల్వే స్టేషన్ కలిగిన ఏకైక వ్యక్తిగా నవాబు హమీద్ అలీ ఖాన్ రికార్డు సృష్టించారు. గ్వాలియర్ వంటి ఇతర సంస్థానాల్లో వెండి రైళ్లు ఉన్నప్పటికీ, అవి ప్యాలెస్ లోపల వడ్డనకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ, రాంపూర్ నవాబు మాత్రం ఏకంగా ప్రయాణాల కోసమే భారీ స్టేషన్‌ను నిర్మించుకోవడం విశేషం. స్వాతంత్య్రం తర్వాత రాంపూర్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైనప్పుడు ఈ ప్రైవేట్ రైల్వే వ్యవస్థ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. నేడు ఆ పట్టాలు, స్టేషన్ శిథిలమైనా, రాంపూర్ నవాబుల అపరిమితమైన విలాసాలకు అవి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us