Telugu News Trending The incident of jawans giving first aid to a person who had a heart attack has gone viral on social media Telugu News
Video Viral: దేశానికి రక్షణగా ఉండటమే కాదు.. ప్రాణాలు కాపాడటమూ తెలుసు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
దేశ సరిహద్దులో శత్రువుల నుంచి రక్షణ కల్పించే సైనికులు.. కొన్ని కొన్ని సార్లు మానవత్వాన్నీ ప్రదర్శిస్తుంటారు. ప్రాణాలు పణంగా పెట్టే జవాన్లు ప్రాణాలు కాపాడేందుకు ముందు ఉంటున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు..
దేశ సరిహద్దులో శత్రువుల నుంచి రక్షణ కల్పించే సైనికులు.. కొన్ని కొన్ని సార్లు మానవత్వాన్నీ ప్రదర్శిస్తుంటారు. ప్రాణాలు పణంగా పెట్టే జవాన్లు ప్రాణాలు కాపాడేందుకు ముందు ఉంటున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా దేశ సేవే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ రేయింబవళ్లు కాపలా కాస్తుంటారు. వారు విధులు నిర్వర్తించే దృశ్యాలు, సన్నివేశాలు చూస్తే గూస్ బంప్స్ వస్తుంటాయి. వారి సాహసాన్ని, దేశ భక్తిని మెచ్చుకోకుండా ఉండలేం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వారి వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుండెపోటు వచ్చిన వ్యక్తికి జవాన్లు సపర్యలు చేస్తున్న దృశ్యాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణికుడికి ఆకస్మాత్తుగా, ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న జవాన్లు సీఐఎస్ఎఫ్ జవాన్లు అతనిని గమనించారు. వెంటనే అలర్ట్ అయ్యి.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.
దుర్గాపూర్‌కు చెందిన శేఖర్ హజ్రా కు.. ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అచేతన స్థితిలో ఉన్న అతడిని గుర్తించిన భద్రతా సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.ఈ వీడియో ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది. వీడియోను చూసిన నెటిజన్లు జవాన్లు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మానవత్వం ప్రదర్శించిన ఈ సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడువతున్నాయి.