AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము కాటేసినా పరీక్షకు హాజరైన బాలిక..ఆ తర్వాత ఏం జరిగిందంటే

పాములు ఎక్కడైనా, ఎప్పుడైనా కనిపించడం సహజమే. వాటి ఆహారం కోసం అవి ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్తూనే ఉంటాయి. కొంతమందైతే పామును చూస్తేనే హడలెత్తిపోతారు.ఎవరి ఇంట్లోనైనా పాము చొరబడితే అక్కడ ఉండే గందరగోళమే వేరు. కొంతమంది పామును బయటికి పంపిచేస్తారు.

పాము కాటేసినా పరీక్షకు హాజరైన బాలిక..ఆ తర్వాత ఏం జరిగిందంటే
Snake
Aravind B
|

Updated on: Mar 26, 2023 | 9:48 AM

Share

పాములు ఎక్కడైనా, ఎప్పుడైనా కనిపించడం సహజమే. వాటి ఆహారం కోసం అవి ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్తూనే ఉంటాయి. కొంతమందైతే పామును చూస్తేనే హడలెత్తిపోతారు.ఎవరి ఇంట్లోనైనా పాము చొరబడితే అక్కడ ఉండే గందరగోళమే వేరు. కొంతమంది పామును బయటికి పంపిచేస్తారు. మరికొంత మంది దాన్ని కర్రతో కొట్టి చంపేస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తు పాము ఎవరినైన కాటు వేస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్తారు. లేదా దగ్గర్లోనే నాటు వైద్యం చేసుకుంటారు. ఒడిశాలోని ఓ బాలిక మాత్రం తనను పాము కాటేసిన పరీక్ష రాస్తానని పట్టుబట్టి పరీక్షకు వెళ్లడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని కేంఝర్ జిల్లా దధిబబపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని లిప్సా రాణి సాహు (17) ఆనందపూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. శనివారం ఫైనల్ పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. అలా వెళ్తుండగా దారిలో అకస్మాత్తుగా పాము కాటేసి వెళ్లిపోయింది. వెంటనే ఈ విషయాన్ని రాణి తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆసుపత్రికి వెళ్దామని తల్లిదండ్రులు చెప్పారు. కానీ ఆ బాలిక మాత్రం అందుకు ఒప్పుకోలేదు. పరీక్షలు రాయకపోతే ఏడాది కాలం వృథా అవుతుందని పట్టుబట్టింది. ఇక చేసేదేమి లేక తండ్రి ఆమెను తన బైక్ పై పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్ష రాస్తుండగా ఆ రాణి అస్వస్థకు గురైంది. దీంతో ఆ బాలిక తండ్రి, సిబ్బంది కలిసి ఆమెను ఆంనందపూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే రాణికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.