Viral Video: పాముల పాలిట యమదూత.. ఒక్క కిక్‌తో విష సర్పాల పని ఖతం.. ఈ పక్షి వీడియో చూస్తే షాకే..
పాముల పాలిట మృత్యువు అంటే ఇదేనేమో.. ఈ పక్షి చూడటానికి అందంగా ఉన్నా.. ఇది విషపూరితమైన పాములను కూడా తన కాళ్లతో ఒక్క కిక్‌తో చంపి తినేస్తుంది. ఈ పక్షి ఎంత వేగంగా పాములను వేటాడుతుందో చూపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సింహాలు, పులులు, మొసళ్ళు వంటి పెద్ద అడవి జంతువులు ప్రమాదకరమైనవని మనకు తెలుసు. కానీ ప్రపంచంలో పాముల పాలిట మృత్యువు అని పిలువబడే ఒక పక్షి ఉందని మీకు తెలుసా.. నిజానికి, ఈ పక్షి అత్యంత విషపూరితమైన పాములను కూడా చంపి.. క్షణాల్లో తినేస్తుంది. ప్రస్తుతం ఈ పక్షికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రజలు షాక్ అవుతున్నారు.
ది ఆర్చర్ ఆఫ్ స్నేక్స్
పాములను చంపి తినే ఈ ప్రత్యేకమైన పక్షి పేరు సెక్రటరీ బర్డ్. ఇది వేటాడే జాతికి చెందిన పక్షి. మొదట ఆఫ్రికాలో కనిపించే ఈ పక్షి ఎక్కువ సమయం నేలపైనే గడుపుతుంది. ఈ పక్షి చూడటానికి చాలా అందంగా ఉన్నప్పటికీ, అత్యంత ప్రమాదకరమైనది. అందుకే దీన్ని ది ఆర్చర్ ఆఫ్ స్నేక్స్ అని కూడా పిలుస్తారు.
ఒక్క కిక్‌తో పాము పని ఖతం..
సెక్రటరీ బర్డ్ వేటాడే నైపుణ్యాలు అద్భుతం. ఈ పక్షి పాములను పట్టుకోవడానికి తన పదునైన, శక్తివంతమైన కాళ్లను ఉపయోగిస్తుంది. ఈ పక్షి తన శరీర బరువుకు ఐదు రెట్లు ఎక్కువ శక్తితో కిక్ ఇవ్వగలదు. ఆ శక్తి సుమారు 195 న్యూటన్‌ల వరకు ఉంటుంది. కేవలం 15 మిల్లీసెకన్లలో ఈ కిక్‌తో అది తన పామును చంపి వేస్తుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఈ పక్షి ఒక పామును చూసినప్పుడు ఎంత వేగంగా దానిపై దాడి చేసి, పదునైన కాళ్ళతో కొట్టి చంపుతుందో చూడొచ్చు. వాస్తవానికి ఈ పక్షి విషపూరితమైన పాములను కూడా అదే విధంగా చంపి తింటుంది. ఈ షాకింగ్ వీడియోను ఎక్స్‌లో @AmazingSights అనే యూజర్ షేర్ చేశారు. ఈ 49 సెకన్ల వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. ఈ పక్షికో దండం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Secretarybird, the most elegant snake killer. Known as “the archer of snakes,” is famed for its remarkable snake-hunting skills. This striking bird uses powerful kicks—up to 195 Newtons, five times its body weight—to kill prey in just 15 ms.pic.twitter.com/nXAuh9uR5d
— Damn Nature You Scary (@AmazingSights) November 4, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
