అమ్మకానికి పురాతన ఇల్లు.. ధర మాత్రం రూ.2480 కోట్లు

ఈ కాలంలో ఓ సొంతిళ్లు ఉండాలని ఇల్లు లేని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం డబ్బులు సంపాదించి చివరికి ఇల్లు కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు.

అమ్మకానికి పురాతన ఇల్లు.. ధర మాత్రం రూ.2480 కోట్లు
Home
Follow us
Aravind B

|

Updated on: Mar 23, 2023 | 7:54 AM

ఈ కాలంలో ఓ సొంతిళ్లు ఉండాలని ఇల్లు లేని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం డబ్బులు సంపాదించి చివరికి ఇల్లు కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు. మరికొంత మంది రెంటు ఉంటూనే తమ జీవనాన్ని సాగిస్తారు. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే లక్షల్లో ఖర్చు ఉంటుంది. ఇంకా ఖరీదైన ఇల్లు కావాలంటే కొన్ని కోట్లు కూడా ఖర్చవుతాయి. అయితే లండన్ లో ఉన్న ఓ పురాతాన ఇల్లు ధర చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. 205 ఏళ్ల నాటి ఆ భవనాన్ని అమ్మకానికి పెట్టారు. దాని ధర మన భారతీయ కరెన్సీలో రూ.2480 కోట్లు. ఇంత ఖరీదైన ఇల్లు ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేదు. అందుకే ఈ ఇల్లు ప్రపంచోలనే అత్యంత ఖరీదైన పురాతన భవనంగా నిలిచింది. ఇది చూడటానికి కాస్త అమెరికా ప్రెసిడెంట్ అధికారికి భవనమైన వైట్ హౌస్ ను పోలి ఉంటుంది.

ఈ రెండంతస్థుల భవనాన్ని వైట్ హౌస్ ఆఫ్ రీజెంట్స్ పార్క్ అని పిలుస్తారు. ఈ భవనం లోపల సుమారు 40 పడక గదులుంటాయి. 8 గ్యారేజీలు, ఓ టెన్నిస్ కోర్టు, ఆవిరి స్నానం చేసేందుకు ప్రత్యేక గది, లైబ్రరీ, అతిపెద్ద డైనింగ్ రూం వంటి అనేక సదుపాయలున్నాయి. జార్జియాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి జేమ్స్ బుర్డన్ ఈ భవనాన్ని 1818లో నిర్మించారు.మొత్తం నాలుగు ఎకరాల లీవింగ్ స్పేస్ ఉంది. అప్పటి నుంచి అనేక మంది చేతులు మారడంతో దాని ధర రెట్టింపు అవుతూ వస్తోంది. ఒకవేళ ఎవరైన ఈ ఇల్లు కొనుక్కుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టెట్ డీల్ జరినట్లుగా నిలిచిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..