AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ‘చిత్రం భళారే విచిత్రం’ నవ్వులే నవ్వులు.. పాత తరం వాళ్ల ‘స్మార్ట్‌’ కష్టాలు చూస్తే..

Viral News: స్మార్ట్‌ఫోన్‌.. ఒక తరాన్ని పూర్తిగా మార్చేసిన అద్భుత సాధనం. ప్రస్తుతం చేతులో స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించని వారిని భూతద్దంలో వెతికినా కనబడే పరిస్థితి లేదు.

Viral News: 'చిత్రం భళారే విచిత్రం' నవ్వులే నవ్వులు.. పాత తరం వాళ్ల 'స్మార్ట్‌' కష్టాలు చూస్తే..
Corning IncorporatedImage Credit source: Corning Incorporated
Narender Vaitla
| Edited By: |

Updated on: Sep 05, 2022 | 3:34 PM

Share

Viral News: స్మార్ట్‌ఫోన్‌.. ఒక తరాన్ని పూర్తిగా మార్చేసిన అద్భుత సాధనం. ప్రస్తుతం చేతులో స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించని వారిని భూతద్దంలో వెతికినా కనబడే పరిస్థితి లేదు. అంతలా స్మార్ట్‌ విప్లవం మానవాళిని కమ్మేసింది. ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ల వరకు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్‌ ఉండాల్సిందే. టెక్నాలజీ తీసుకొచ్చిన ఈ మార్పుతో జనం స్మార్ట్‌గా మారిపోయారు. అయితే స్మార్ట్‌ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చి కేవలం 15 ఏళ్లు మాత్రమే అవుతుంది. ఈ తరం వాళ్లకు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే తెలుసు. కానీ పాత తరం అంటే మన తండ్రి, తాతల తరం వాళ్లకు స్మార్ట్ ఫోన్‌ అనేది కొత్తగా ఊడిపడ్డ వస్తువు. మరి ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించడంలో పాత తరం వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు.? స్మార్ట్‌ ఫోన్‌లు ఉపయోగించే సమయంలో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లాంటి అంశాలను కొందరు ప్రముఖ సోషల్‌ మీడియా క్రియేటర్ల ఫన్నీ వీడియోలుగా రూపొందించి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అలాంటి కొన్ని ఫన్నీ వీడియోలపై మీరూ ఓ లక్కేయండి..

అతి జాగ్రత్త.. ఈ తరం వాల్లు స్మార్ట్‌ ఫోన్‌ను ఎలా పడితే అలా వాడుతున్నారు. కానీ పాత తరం వాళ్లు మాత్రం దానిని ఒక అపురూప వస్తువుగా చూస్తుంటారు. కారణం ఫోన్‌ల ధరలు ఎక్కువగా ఉండడమే. అందుకే ఫోన్‌లను జాగ్రత్తగా చూసుకుంటారు. ఫోన్‌ను టేబుల్‌కు చివర్లలో పెడ్డకూడదంటూ, పౌచ్‌ వేయాలి అంటూ రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ అంశాన్నే ఇతివృత్తంగా చేసుకొని ఆర్‌జేకరిష్మా అనే యూట్యూబ్‌ క్రియేటర్‌ రూపొందించిన ఫన్నీ వీడియోను చూసేయండి..

View this post on Instagram

A post shared by RJ Karishma (@rjkarishma)

పిల్లలు ఏం చూస్తున్నారని కంగారు పడేవాళ్లు..

కొందరు పేరెంట్స్‌ తమ పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తారని ఆలోచిస్తుంటారు. ఆలోచించడమే కాదు ఆందోళన పడుతుంటారు. నిత్యం వారి ఫోన్‌ను ఎలాగైనా చూడాలని ప్రయత్నిస్తుంటారు. అయితే పిల్లలు కూడా తమ ఫోన్‌ను పేరెంట్స్‌కి ఇవ్వకుండా ఎత్తులు వేస్తుంటారు. ఈ అంశాల ఆధారంగానే రూపొందించిన ఓ వీడియోను చూసేయండి..

View this post on Instagram

A post shared by Funyaasi (@funyaasi)

గ్రామీణ ప్రాంతాల్లో అమ్మలు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమ్మలు స్మార్ట్‌ ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తారనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. ది విష్ణు కౌశల్‌ అనే క్రియేటర్‌ రూపొందించిన ఈ వీడియో నెటిజన్లు కడపుబ్బ నవ్విస్తోంది. ఈ వీడియోను మీరూ ఓసారి చూసేయండి..

నాకు అన్ని తెలుసు అనుకునే వారు..

కొందరు తండ్రులు తమకు ఏం తెలియకపోయినా ఈ జనరేషన్‌ వాళ్లతో ఏం ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో తెలియని విషయాన్ని అడుగుతారు.. అనంతరం తమల్ని ఎక్కడ తక్కువ అంచనా వేస్తారో అని. నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా.? నాకే చెబుతున్నావా.. అంటూ కవరింగ్ చేస్తుంటారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందించిన వీడియోపై ఓలుక్కేయండి..