AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ చిన్నోడు ఇప్పుడు స్టార్​ క్రికెటర్..​ పెను తుఫాన్ తలొంచి చూసే నిప్పు కణం అతడు.. గుర్తుపట్టారా..?

పెను తుఫాన్ తలొంచి చూసే నిప్పు కణం అతడు. బరిలోకి దిగితే బౌలర్లకు ఊచకోతే. బ్యాట్ పట్టి అతడు నడుస్తుంటే.. కొదమ సింహం మాదిరి ఉంటాడు. ఎవరో గుర్తించారా..?

Viral Photo: ఈ చిన్నోడు ఇప్పుడు స్టార్​ క్రికెటర్..​ పెను తుఫాన్ తలొంచి చూసే నిప్పు కణం అతడు.. గుర్తుపట్టారా..?
Viral Photo
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2022 | 12:36 PM

Share

ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తించారా..? కష్టంగా ఉందా..? అవును ఫోటో క్లారిటీ సరిగ్గా లేదు కాబట్టి కనిపెట్టడం కష్టమే. ఇప్పుడు ఇంట్రో ఇస్తున్నాం. కనీసం గెస్ అయినా చేయండి.  ఆకాశమే అతడి హద్దు. బ్యాటింగ్‌కి దిగితే ఊచకోతే. అతను గ్రౌండ్‌లోకి అడుగుపెడితే ప్రత్యర్థి బాలర్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ప్రస్తుతం అత్యద్భుతమైన ఫామ్‌తో భారత క్రికెట్ ప్రేమికుల మనసు దోచుకుంటున్నాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడుతూ పరగుల వరద పారిస్తున్నాడు. ఎలాంటి బంతి వేసినా బౌండరీ లైన్ దాటించడమే అతడి పని. ప్రజంట్ వరల్డ్ కప్‌లో రొమాలు నిక్కపొడుచుకునే షాట్స్‌తో దుమ్మురేపుతున్న అతడిని అభిమానులు ముద్దుగా ‘స్కై’ (SKY) అని పిలుచుకుంటారు. యస్.. హీ ఈజ్ నన్ అదర్ దెన్‌ సూర్య కుమార్ యాదవ్.

ప్రజంట్ భీకర ఫామ్‌లో ఉన్నాడు యాదవ్. గ్రౌండ్ నలువైపులా.. మాజీ క్రికెట్ లెజెండ్స్  సైతం ఆశ్చర్యపరిచే షాట్స్‌తో విరుచుకుపడుతున్నాడు. ఒకప్పుడు ఇలాంటి షాట్స్ ఏబీ  డివిలియర్స్‌ ఆడేవాడు. ఇప్పుడు అతడు లేడని వర్రీ అవ్వడానికి లేదు. మిస్టర్ 360 వారసుడు స్కై వచ్చాడు. అంతకుమించిన బ్యాటింగ్ స్టైల్‌తో నివ్వెరపోయాలా చేస్తున్నాడు. ఐపీఎల్‌లో అదిరే ఇన్నింగ్స్ ఎన్నో ఆడిన సూర్య.. ఇంటర్నేషన్ ఎంట్రీ ఇవ్వడానికి కాస్త టైమ్ లేటయ్యింది. ఎంట్రీ లేటయినా సరే.. తన మార్క్ ఏంటో చూపిస్తున్నాడు. ప్రజంట్ టీ20 వరల్డ్ కప్‌లో తన స్టామినా చూపిస్తున్నాడు.  జింబాబ్వేపై జరిగిన మ్యాచ్ స్టన్నింగ్ షాట్స్‌తో విరుచుకుపడి  25 బంతుల్లో 61 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ప్రజంట్ మస్త్ ట్రెండ్ అవుతున్న ‘స్కై’ గురించి తెలుసుకునేందుకు క్రికెట్ లవర్స్‌తో పాటు నెటిజన్స్ అటెన్షన్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తవ్వకాల్లో అతడి చిన్ననాటి ఫోటో ఒకటి దొరికింది. దీనిలో అతడిని గుర్తించలేకపోతున్నారు చాలామంది. ఎనీ వే సూర్య కుమార్ యాదవ్.. మున్ముందు మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటాడని ఆశిద్దాం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..