తాళికట్టు శుభవేళ..! పెళ్లి మండపంలోకి చొరబడి విధ్వంసం సృష్టించిన యువతి..ఏం జరిగిందంటే..
చిక్‌మగళూరులో పెళ్లి జరుగుతుండగా, శరత్ అనే వరుడు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ అశ్విని అనే యువతి మండపంలో విధ్వంసం సృష్టించింది. 10 ఏళ్ల ప్రేమ, 2 నెలల వివాహం తర్వాత శరత్ రూ. 4.5 లక్షలు తీసుకుని విడాకులు ఇచ్చి వేరొకరిని పెళ్లాడుతున్నాడని ఆమె వెల్లడించింది. దీనిపై మూడు కేసులు పెట్టినట్లు అశ్విని పేర్కొంది.

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు, వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని పెళ్లి వీడియోలు, వివాహ వేడుకకు సంబంధించిన అనేక సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటి సంఘటనే జరిగింది. అట్టహాసంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. వధూవరులు మండపంలోకి ప్రవేశించారు. అంతలోనే మరో యువతి ఎంట్రీ ఇచ్చింది. దీంతో కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని చిక్కమగళూరులో పెళ్లి జరుగుతుండగా, అశ్విని అనే యువతి పెళ్లి మండపంలోకి చొరబడి విధ్వంసం సృష్టించింది. వరుడు శరత్ తనను మోసం చేశాడంటూ యువతి ఆరోపించింది. గత 10 సంవత్సరాలుగా శరత్ తో ప్రేమలో ఉన్నానని, తనను నమ్మించి రూ. 4.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె ఆరోపించింది.
శరత్ తో తనకు వివాహం జరిగిన 2 నెలలకే విడాకులు తీసుకున్నామని, అతను తనను మోసం చేసి ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిపింది. అతనిపై మూడు కేసులు పెట్టానని, అందుకు ప్రతీకారంగా తనపై దాడి చేపించాడని చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




