AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కనికరం లేదా సారూ..! బాలుడిని చితకబాదిన ఉపాధ్యాయుడు.. మండిపడుతున్న నెటిజన్లు..

ఉపాధ్యాయుడి దాడి అనంతరం ఐదేళ్ల విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాట్నాలోని ధనరువా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: కనికరం లేదా సారూ..! బాలుడిని చితకబాదిన ఉపాధ్యాయుడు.. మండిపడుతున్న నెటిజన్లు..
Viral News
Shaik Madar Saheb
|

Updated on: Jul 05, 2022 | 6:29 PM

Share

Teacher brutally thrashes boy: బీహార్ రాజధాని పాట్నాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోచింగ్ క్లాస్‌రూమ్‌లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని స్పృహ కోల్పోయేలా దారుణంగా కొట్టాడు. ఈ దృశ్యం కెమెరాకు చిక్కడంతో.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఉపాధ్యాయుడి దాడి అనంతరం ఐదేళ్ల విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాట్నాలోని ధనరువా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోచింగ్ సెంటర్‌కు చెందిన టీచర్ ఆ బాలుడిని కనికరం లేకుండా కర్రతో కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ దాడిలో కర్ర రెండుగా విరిగిపోవడంతో ఉపాధ్యాయుడు బాలుడిని తన్నడం, కొట్టడం ప్రారంభించాడు.

వీడియోలో.. బాలుడు ఏడుస్తూ తనను కొట్టవద్దని ఉపాధ్యాయుడిని వేడుకున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు కనికరం లేకుండా ఆ బాలుడిని దారుణంగా కొట్టడంతో తట్టుకోలేక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో ఇతర విద్యార్థులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయుడిని ఆపడానికి ప్రయత్నించలేదు. ఈ దారుణ ఘటనతో కలత చెందిన స్థానికులు ఉపాధ్యాయుడిని పట్టుకుని కొట్టారు. ఉపాధ్యాయుడిని ‘ఛోటు’గా గుర్తించారు. కోచింగ్ సెంటర్ యజమాని అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో.. 

మరోవైపు చిన్నారి కుటుంబసభ్యులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కోచింగ్ సెంటర్‌ను స్థానికులు ధ్వంసం చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను వీడియో తీసిన స్థానికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జయ కోచింగ్ క్లాస్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఉపాధ్యాయుడి తీరుపై మండిపడుతున్నారు. అతన్ని శిక్షించాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.