Viral video: అమ్మ బాబోయ్.. బామ్మ ధైర్యాన్ని చూస్తే అవాక్ అవ్వాల్సిందే.. పాము తోక పట్టుకొని..

పామును పట్టుకోవడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు వాటిని పట్టేవారు కూడా వాటి కాటుకు బలవుతారు. విషపూరితమైన పాములను పట్టుకోవడం అయితే కత్తిమీద సాము లాంటిది.

Viral video: అమ్మ బాబోయ్.. బామ్మ ధైర్యాన్ని చూస్తే అవాక్ అవ్వాల్సిందే.. పాము తోక పట్టుకొని..
Snake
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 29, 2022 | 1:30 PM

Viral video: పామును పట్టుకోవడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు వాటిని పట్టేవారు కూడా వాటి కాటుకు బలవుతారు. విషపూరితమైన పాములను పట్టుకోవడం అయితే కత్తిమీద సాము లాంటిది. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ కొంతమంది మాత్రం చిన్న భయం కూడా లేకుండా వాటి తోకలు పట్టుకొని మరీ ఆడుకుంటూ ఉంటారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

తాజాగా ఓ షాకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ బామ్మ విషపూరితమైన పామును పట్టుకుని నడుచుకుంటూ వెళ్లిన తీరు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది. ఒంటి చేత్తో నాగు పామును పట్టుకుని పక్కనే ఉన్న పొలాల్లో వదిలేసింది బామ్మ. ఇక ఈ షాకింగ్‌ సీన్‌ను చూసిన నెటిజన్స్‌ బామ్మ ధైర్యాని తెగ మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు.? ఎక్కడ జరిగిందో తెలిదు కానీ ప్రస్తుతం నెటింట్లో తెగ వైరల్‌ అవుతుంది. ఈవీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి .

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి