Funny Video: మీరెక్కడ దొరికార్రా బాబూ.. ఆ మ్యూజిక్ ఏంది, ఆ డ్యాన్స్ ఏంది.. కబడ్డీ డ్యాన్స్ చూస్తే పొట్టచెక్కలే..

కొన్ని కొన్ని విషయాలను మనల్ని చిరాకు తెప్పిస్తాయి. మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి. మనసు నిలకడగా ఉండదు. అలాంటి పరిస్థితిలో కాస్త రిలాక్స్ కోసం నిద్ర పోవడం గానీ, టీ, కాఫీ తాగడం, విశ్రాంతి తీసుకోవడం చేస్తారు. మరికొందరు తమ మొబైల్‌లో కామెడీ వీడియోలను చూస్తారు.

Funny Video: మీరెక్కడ దొరికార్రా బాబూ.. ఆ మ్యూజిక్ ఏంది, ఆ డ్యాన్స్ ఏంది.. కబడ్డీ డ్యాన్స్ చూస్తే పొట్టచెక్కలే..
Kabaddi Dance
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 15, 2023 | 4:15 PM

కొన్ని కొన్ని విషయాలను మనల్ని చిరాకు తెప్పిస్తాయి. మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి. మనసు నిలకడగా ఉండదు. అలాంటి పరిస్థితిలో కాస్త రిలాక్స్ కోసం నిద్ర పోవడం గానీ, టీ, కాఫీ తాగడం, విశ్రాంతి తీసుకోవడం చేస్తారు. మరికొందరు తమ మొబైల్‌లో కామెడీ వీడియోలను చూస్తారు. మీరు కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నట్లయితే, మూడీ ఉన్నట్లయితే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసేయండి. అప్పటి వరకు ఉన్న మూడ్ఆఫ్ పరిస్థితి.. పరారై.. పొట్టచెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తుంది. అవును, పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

సాధారణంగానే స్కూల్, కాలేజీలో ప్రత్యేక కార్యక్రమాలు, సెలబ్రేషన్స్, ఫేర్‌వెల్, ప్రెషర్స్ పార్టీలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో స్టూడెంట్స్ డ్యాన్స్, నాటకాలు సహా వినూత్న కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో భాగంగా కొందరు స్టూడెంట్స్ వినూత్న రీతిలో డ్యాన్స్ చేశారు. కబడ్డీ డ్యాన్స్ పేరుతో, సరికొత్త మ్యూజిక్ మిక్స్‌తో దుమ్ము రేపారు. వారి వింత, వినూత్నమైన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఆ మ్యూజిక్ ఏంటీ.. ఆ డ్యాన్స్ ఏంటీ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..