భద్రాద్రి జిల్లాలో గూఢచారి రాబందు సంచారం.. జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరాతో నిఘా! చివరకు ఏం జరిగిందంటే?

పక్షిని పట్టుకుని చర్ల అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ పక్షిని ఎక్కడికి పంపించాలనేది అటవీశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు...ఇలాంటి పక్షి సంచారం స్థానికంగా కలకలం రేపింది.

భద్రాద్రి జిల్లాలో గూఢచారి రాబందు సంచారం.. జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరాతో నిఘా! చివరకు ఏం జరిగిందంటే?
Hawk with gps tracker and camera
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 04, 2024 | 11:04 AM

GPS ట్రాకర్ ఉన్న ఒక గద్ద సంచారం అక్కడి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో గద్ద లాంటి పక్షి సంచరిస్తూ స్థానికులు కంట పడింది.. ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించని ఈ వింత పక్షి కి జీపీఎస్ ట్రాకర్లతో పాటు కెమరాలు ఉండటం కలకలం రేపింది.. మూడు రోజుల క్రితం చర్ల నాయక కాలనీ సమీపంలో గుట్ట వద్ద ఈ పక్షి కనిపించింది. స్థానికులు గమనించి వెంటనే పోటోలు వీడియోలు తీశారు. అయితే ట్రాకర్, కెమెరా ఉండటంతో తొలుత అందరూ భయపడ్డారు..మావోయిస్టులపై నిఘా కోసం పోలీసులు ఇలా అమర్చారా అనే కోణంలో చర్చ జరిగింది..

అయితే ఈ ఘటన మూడు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పోలీసులు స్పందించారు. తాము ఎలాంటి పక్షినీ వదల్లేదనీ చెప్పారు. దీంతో ఆ వింత ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారు..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

చర్ల అటవీశాఖ అధికారులు రాబందు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పోలీసు నిఘా వర్గాలు కూడా ఆరా తీశారు. జీపీఎస్ ట్రాకర్, కెమరాను కల్గిన పక్షిని చర్ల మండల చిన్న మిడిసిలేరులోని తాలిపేరు గ్రామ ప్రాజెక్టు సమీపంలో గుర్తించారు. పక్షిని పట్టుకుని చర్ల అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ పక్షిని ఎక్కడికి పంపించాలనేది అటవీశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు…ఇలాంటి పక్షి సంచారం స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే