150 నాటి దేవతా విగ్రహం చోరీ చేసిన దొంగ.. నా కొద్దు బాబోయ్ అంటూ తిరిగి ఇచ్చేశాడు..! ఎందుకో తెలుసా..?

జాతీయ రహదారిలోని గౌఘాట్ లింక్ రోడ్డు వద్ద ఒక గుర్తు తెలియని గోనె సంచి మూట ఒకటి కనిపించింది. అది చూసిన స్థానికులు అనుమానంతో తెరిచి చూడగా అందులో చోరీకి గురైన విగ్రహంతో పాటు ఒక లేఖ కూడా ఉంది. ఆ విగ్రహాన్ని గుర్తించి గౌఘట్ ఖల్సా ఆశ్రమానికి తీసుకెళ్లారు. విగ్రహాన్ని చోరీ చేసిన దొంగ ఆ లేఖలో క్షమాపణ కోరుతూ లేఖలో ఇలా రాశాడు.. అలా లేఖలో ఇలా రాశాడు.. ‘అయ్యా పూజారి నేను పెద్ద తప్పు చేశాను.

150 నాటి దేవతా విగ్రహం చోరీ చేసిన దొంగ.. నా కొద్దు బాబోయ్ అంటూ తిరిగి ఇచ్చేశాడు..! ఎందుకో తెలుసా..?
Man Steals Idol
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 04, 2024 | 9:24 AM

ఒక ఆలయంలోని వందేళ్ల నాటి పురాతన దేవతా విగ్రహం వారం రోజుల క్రితం చోరీకి గురైంది. విగ్రహం చోరీ ఘటనపై ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 150 ఏళ్ల నాటి రాధా-కృష్ణ విగ్రహం కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన ఆలయ పూజారి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలో చోరీకి గురైన పురాతన విగ్రహాన్ని తిరిగి ఇచ్చేశాడు సదరు దొంగ. దాంతో పాటు క్షమాపణ లేఖను కూడా గుడిలో పెట్టి వెళ్లాడు. తాను చేసిన నేరానికి క్షమాపణలు కోరుతూ క్షమాపణ లేఖను ఆలయ గుమ్మం వద్ద వదిలిపెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో జరిగింది ఈ విచిత్ర సంఘటన. సెప్టెంబర్ 23న నవాబ్‌గంజ్‌లోని రామ్ జానకి ఆలయంలో వందేళ్ల నాటి అష్టధాతువు రాధా కృష్ణ విగ్రహం చోరీ అయ్యింది. ఓ దొంగ గుడి తలుపు తాళం పగులగొట్టి రాధా-కృష్ణుల విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే వారం రోజులు గడిచినా పోలీసులు ఆ విగ్రహాన్ని గుర్తించలేకపోయారు. కాగా, పురాతన దేవతా విగ్రహం దొంగతనం పట్ల ఆలయ పూజారి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. విగ్రహం కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగాడు. ఈ క్రమంలోనే ఊహించని విదంగా చోరీకి గురైన విగ్రహం దొరికింది.

ఆలయం దొంగతనం జరిగిన వారం రోజుల తర్వాత జాతీయ రహదారిలోని గౌఘాట్ లింక్ రోడ్డు వద్ద ఒక గుర్తు తెలియని గోనె సంచి మూట ఒకటి కనిపించింది. అది చూసిన స్థానికులు అనుమానంతో తెరిచి చూడగా అందులో చోరీకి గురైన విగ్రహంతో పాటు ఒక లేఖ కూడా ఉంది. ఆ విగ్రహాన్ని గుర్తించి గౌఘట్ ఖల్సా ఆశ్రమానికి తీసుకెళ్లారు. విగ్రహాన్ని చోరీ చేసిన దొంగ ఆ లేఖలో క్షమాపణ కోరుతూ లేఖలో ఇలా రాశాడు..

ఇవి కూడా చదవండి

‘అయ్యా పూజారి నేను పెద్ద తప్పు చేశాను. నా అజ్ఞానం కారణంగా గౌఘాట్ నుంచి రాధా కృష్ణ విగ్రహాన్ని దొంగిలించాను. అప్పటి నుంచి నాకు చెడు కలలు వస్తున్నాయి. నా కుమారుడి ఆరోగ్యం కూడా క్షిణించింది. కొంత డబ్బు కోసం నేను నిజంగా తప్పు చేశాను. క్షమించమని కోరుతూ విగ్రహాన్ని తిరిగి ఇస్తున్నా. నన్ను, నా పిల్లలను క్షమించమని పూజారిని వేడుకుంటున్నా. విగ్రహాన్ని గుడిలో తిరిగి ఉంచాలని కోరుతున్నా’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో పూజారి ఆ విగ్రహాన్ని ఆలయంలో తిరిగి ప్రతిష్టించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..