వీడు రీల్ స్పైడర్‌మ్యాన్ కాదు… రియల్!

ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం స్పైడర్‌మ్యాన్‌లో పీటర్‌ పార్కర్‌ చేసిన విన్యాసాలు అందరూ చూసే ఉంటారు. అయితే అవన్నీ గ్రాఫిక్స్‌తోనే సాధ్యం. కానీ అమెరికాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం మనకు నిజంగానే ఓ స్పైడర్‌మ్యాన్‌ని చూపించింది. ఫిలడెల్ఫియాలో ఓ 19 అంతస్తుల భవనంలో హఠాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడో అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా పైకి ఎగబాకాయి. ఈ క్రమంలో దట్టమైన పొగలు మొత్తం భవనానికి వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ప్రజలు ముందుగానే అందులో […]

వీడు రీల్ స్పైడర్‌మ్యాన్ కాదు... రియల్!
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 7:46 PM

ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం స్పైడర్‌మ్యాన్‌లో పీటర్‌ పార్కర్‌ చేసిన విన్యాసాలు అందరూ చూసే ఉంటారు. అయితే అవన్నీ గ్రాఫిక్స్‌తోనే సాధ్యం. కానీ అమెరికాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం మనకు నిజంగానే ఓ స్పైడర్‌మ్యాన్‌ని చూపించింది. ఫిలడెల్ఫియాలో ఓ 19 అంతస్తుల భవనంలో హఠాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడో అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా పైకి ఎగబాకాయి. ఈ క్రమంలో దట్టమైన పొగలు మొత్తం భవనానికి వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ప్రజలు ముందుగానే అందులో నుంచి తప్పించుకోగలిగారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ క్రమంలో దాదాపు 15వ అంతస్తులో ఉన్న ఓ యువకుడు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పెద్ద సాహసమే చేశాడు. ఏ ఆధారం లేకుండా స్పైడర్‌మ్యాన్‌ తరహాలో దాదాపు 14 అంతస్తులు అలవోకగా దిగేశాడు. అదీ కేవలం మూడు నిమిషాల్లోనే. ప్రమాద ఘటనను హెలికాప్టర్‌ ద్వారా కవర్‌ చేస్తున్న స్థానిక మీడియా సంస్థలు ఆ యువకుడి సాహసాన్ని వీడియోలో బందించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే అతను ఎవరు, ఏంటి అన్నది మాత్రం తెలియరాలేదు.