Viral Video: పురాతన నిధి కోసం వెతుకుతుండగా దొరికిన నల్లటి సంచి.. ఏముందో చూడగా.!

సోషల్ మీడియాలో రకరకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. వీటిల్లో ఏది నిజమో.. ఏది అబద్దమో చెప్పలేం కానీ.. వాటిని చూసినప్పుడు మాత్రం మన కళ్లను మనమే నమ్మలేం. ఇక ఆ వీడియోల తరహాలోనే ఇటీవల మరొకటి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Viral Video: పురాతన నిధి కోసం వెతుకుతుండగా దొరికిన నల్లటి సంచి.. ఏముందో చూడగా.!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 17, 2024 | 1:40 PM

సోషల్ మీడియాలో రకరకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. వీటిల్లో ఏది నిజమో.. ఏది అబద్దమో చెప్పలేం కానీ.. వాటిని చూసినప్పుడు మాత్రం మన కళ్లను మనమే నమ్మలేం. ఇక ఆ వీడియోల తరహాలోనే ఇటీవల మరొకటి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఓ వ్యక్తి పురాతన నిధిని వెతికే క్రమంలో రాళ్లను బద్దలుకొట్టి.. మట్టిని తవ్వుతుండగా.. ఓ నల్లటి సంచి బయటపడింది. దాన్ని ఓపెన్ చేయగా.. చివరికి జరిగిందిదే..

ఓ వ్యక్తి పురాతన నిధి కోసం తవ్వకాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగానే తన దగ్గర ఉన్న మెటల్ డిటెక్టర్‌తో నేలను పరిశీలించాడు. ఒక చోట ఉన్నట్టుండి సౌండ్ వినిపించింది. అక్కడ రాళ్లను తొలగించి.. మట్టిని తవ్వగా.. ఓ నల్లటి సంచి బయటపడింది. దాన్ని ఓపెన్ చేయడంతో దెబ్బకు షాక్ తిన్నాడు. ఆ సంచిలో నుంచి ఓ పాము బయటకొచ్చింది. ఆ పాము వెళ్లగానే అందులో ఇంకేముందో చూడగా.. పలు బంగారు నాణేలు బయటపడ్డాయి. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చిపడుతున్నాయ్. అయితే నెటిజన్లు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘ఇందులో నిజం లేదని.. కానీ ఆసక్తికరంగా ఉందని’ అంటూ కొందరు ‘ఇలాంటి తప్పుడు సమాచారం కలిగిన వీడియోలు వైరల్ చేయకండి’.. అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..