Viral: మరికొద్ది గంటల్లో పెళ్లి.. ఇంతలో వరుడు చేసిన పనికి అంతా షాక్.. ఆ తర్వాత జరిగిందిదే

చివరి క్షణంలో పెళ్లికి వరుడు నిరాకరించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. మరికొద్ది గంటల్లో పెళ్లి.. రెండు కుటుంబాలు సంబరాల్లో మునిగితేలారు. కట్ చేస్తే.. పెళ్ళికూతురు ముఖం చూసి ఒక్కసారిగా.. పెళ్లికొడుకు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తనకు ఈ పెళ్లి వద్దంటూ..

Viral: మరికొద్ది గంటల్లో పెళ్లి.. ఇంతలో వరుడు చేసిన పనికి అంతా షాక్.. ఆ తర్వాత జరిగిందిదే
Marriage
Follow us

|

Updated on: Jun 17, 2024 | 1:02 PM

చివరి క్షణంలో పెళ్లికి వరుడు నిరాకరించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. మరికొద్ది గంటల్లో పెళ్లి.. రెండు కుటుంబాలు సంబరాల్లో మునిగితేలారు. కట్ చేస్తే.. పెళ్ళికూతురు ముఖం చూసి ఒక్కసారిగా.. పెళ్లికొడుకు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తనకు ఈ పెళ్లి వద్దంటూ.. తెగేసి చెప్పేశాడు. అసలేం జరిగిందంటే..!

వివరాల్లోకెళ్తే.. చౌరిచౌరా అనే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది. హర్యానాలో నివాసముంటున్న ఓ కుటుంబం తమ కుమారుడికి వధువును వెతికే క్రమంలో.. చౌరీచౌరాకి వచ్చింది. అక్కడ ఓ అమ్మాయి ఫోటో చూసి.. పెళ్లిని నిశ్చయించారు. వధువు కుటుంబం దగ్గర పెళ్లి జరిపించేంత డబ్బు లేకపోవడంతో.. ఆ ఖర్చులన్నీ కూడా అబ్బాయి కుటుంబీకులు భరించారు.

జూన్ 16న ఊరేగింపులా పెళ్లి మండపానికి వచ్చాడు వరుడు. వేదికపైకి రాగానే వరుడు.. పరదా తీసి పెళ్లికూతురు ముఖాన్ని చూశాడు. ఆమె ఫోటోలో చూసిన దానికన్నా.. నల్లగా ఉండటంతో.. తనకు ఈ పెళ్లి వద్దంటూ హంగామా సృష్టించాడు. పెళ్లికి తాను పెట్టిన డబ్బు మొత్తాన్ని రిటర్న్ చేయాలని చెప్పాడు. తనకు పెళ్లికూతురు ఫోటోషాప్ ఫోటో చూపించి మోసం చేశారని మండిపడ్డాడు. ఇక పెళ్లికొడుకు మాటలు విని అక్కడున్న వారు కూడా ఆశ్చర్యపోయారు. అలాగే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో.. పోలీసులు సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..