AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Girl: ఈ కాలపు ఊర్మిళ..ఒక్కసారి పడుకుందా..ఇక పదమూడు రోజులపాటు నిద్రలోనే..అలా ఎందుకంటే..

రామాయణంలో లక్ష్మణుడి భార్య పధ్నాలుగేళ్ళు నిద్రలోనే గడిపిందని చెబుతారు. అలాగే, కుంభకర్ణుడు నిద్ర పొతే ఎప్పుడు లేస్తాడో తెలీదు అంటారు. ఇప్పుడు కూడా కొంతమంది నిద్ర ప్రియులు ఖాళీ దొరికితే రోజులో ఎక్కువసేపు నిద్రలోనే గడిపేయడానికి ప్రయత్నిస్తారు.

Sleeping Girl: ఈ కాలపు ఊర్మిళ..ఒక్కసారి పడుకుందా..ఇక పదమూడు రోజులపాటు నిద్రలోనే..అలా ఎందుకంటే..
Sleeping Girl
KVD Varma
|

Updated on: May 01, 2021 | 12:34 PM

Share

Sleeping Girl: రామాయణంలో లక్ష్మణుడి భార్య పధ్నాలుగేళ్ళు నిద్రలోనే గడిపిందని చెబుతారు. అలాగే, కుంభకర్ణుడు నిద్ర పొతే ఎప్పుడు లేస్తాడో తెలీదు అంటారు. ఇప్పుడు కూడా కొంతమంది నిద్ర ప్రియులు ఖాళీ దొరికితే రోజులో ఎక్కువసేపు నిద్రలోనే గడిపేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు నిద్రపోయారు అంటే.. ఎప్పుడు లేస్తారు అనేది చెప్పలేరు ఎవ్వరూ. కొంతమంది ఆరోగ్య పరిస్థితుల రీత్యా వాడుతున్న మందుల వలన ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆమ్మాయి ఒకసారి నిద్రపోతే.. 13 రోజుల పాటు నిద్రలోనే ఉండిపోతుంది. అలాగని ఆమెకు నిద్రపోవడం సరదా అని అనుకోవద్దు. ఆమె ఒక వింత సమస్యతో బాధపడుతోంది.

ఇండోనేషియాలోని దక్షిణ కాలిమంటన్ ప్రాంతంలోని బంజర్ మాసిన్ లో ఏచా అనే 17 ఏళ్ల బాలిక నివసిస్తోంది. ఒకసారి 2017 సంవత్సరంలో వరుసగా 13 రోజులపాటు నిద్రపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. ఒక్కరోజు తిండి లేకపోతేనే నీరసం వచ్చేస్తుంది. అలాంటిది ఏకంగా 13 రోజులపాటు ఎటువంటి తిండి..నీరులేకుండా నిద్రలో ఉండిపోవడం అంటే మాటలు కాదుకదా.

ఏచా ఇలా ఒకసారి నిద్రపోతే ఎప్పుడు లేస్తుందో తెలీని పరిస్థితి రెండు..మూడుసార్లు జరిగేసరికి ఆమె తండ్రి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్లు ఆమెను పరిశేలించి ఆమెకు ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయితే, అతిగా నిద్రపోవడం వలన ఆమె చాలా బలహీనంగా ఉందని తెలిపారు. సాధారణంగా ‘హైపర్సోమ్నియా’ అనే అరుదైన న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి ఇటువంటి అతి నిద్ర సమస్య వస్తుందని డాక్టర్లు చెప్పారు. జన్యు సంబంధిత లేదా మానసిక సమస్యలతో ఇలా జరుగుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంకంటే ఎక్కువ సేపు నిద్రపోతుంటారని వారు వివరించారు.

ఏచా తండ్రి ముల్యాది మాట్లాడుతూ.. ‘‘ఆమెను నిద్ర నుంచి లేపడానికి చాలాసార్లు ప్రయత్నించేవాడిని. నాకు అలసట వచ్చేది కానీ ఆమె మాత్రం నిద్రలేచేది కాదు. నిద్రలో ఉన్నప్పుడే ఆమెను బాత్రూమ్‌కు తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాం’’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ సమస్యకు చికిత్స లేదని వైద్యులు తెలుపుతున్నారని పేర్కొన్నాడు. ఆమె ఎప్పుడూ మేల్కొని ఉండాలని, తమతో కలిసి జీవించాలని కోరుకుంటున్నామని ఆయన చెబుతున్నాడు.

ఈ వీడియో చూడండి..

Also Read: వైరల్, ఇలా కూడా జరుగుతుందా ? ఆ మమ్మీ ఈజిప్ట్ మత గురువుది కాదు, అది గర్భిణీ అట !

Nirav Modi: భారత్‌కు అప్పగించొద్దు.. నాకు న్యాయం జరగదు.. యూకే హైకోర్టులో నీరవ్ మోదీ పిటిషన్