Viral Video: డ్రెయిన్‌లో చిక్కుకున్న భారీ కొండ చిలువ.. రక్షించిన స్థానికులు.. వీడియో వైరల్
ఒక కొండ చిలువకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో హృదయాన్ని కదిలిస్తుంది. ఒక భారీ కొండచిలువ డ్రెయిన్‌లో ఇరుక్కుపోవడంతో కొందరు తాడుతో కట్టి బయటకు తీశారు. కొంత మంది వ్యక్తులు తాడును ఉచ్చుగా మార్చి డ్రైనేజ్ లో తాడుని వేలాడదీశారు. ఇది వీడియోలో మీరు చూడవచ్చు.
ప్రకృతిలో ఉన్న రకరకాల జీవుల్లో పాములు ఒకటి. అనేక రకాల పాములు ఉన్నాయి. కొన్ని రకాల పాములు ప్రాణాలు తీసే విషం కలిగి ఉంటే మరికొన్ని విషం లేని పాములు. కింగ్ కోబ్రా, కట్లపాము, వంటివి విషంకలిగిన పాములు ప్రాణాలకు హానిని కలిగించే పాము.. వీటిని తరచుగా చూస్తూనే ఉంటాం. పాములు ప్రజలు భయబ్రాంతులకు గురవుతూ ఉంటారు. విషం లేని కొండ చిలువ కూడా ప్రాణహాని కలిగించేదే.. దీనిని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. విషం లేని పైథాన్ ఒక వ్యక్తిని లేదా జంతువుని అవలీలగా చంపేస్తుంది.
అయితే ఒక కొండ చిలువకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో హృదయాన్ని కదిలిస్తుంది. ఒక భారీ కొండచిలువ డ్రెయిన్‌లో ఇరుక్కుపోవడంతో కొందరు తాడుతో కట్టి బయటకు తీశారు. కొంత మంది వ్యక్తులు తాడును ఉచ్చుగా మార్చి డ్రైనేజ్ లో తాడుని వేలాడదీశారు. ఇది వీడియోలో మీరు చూడవచ్చు. కొండచిలువ ఉచ్చులో తన శరీరాన్ని పెట్టగానే ఆ ఉచ్చులో కొండచిలువ బంధించి ఆ తాడును గట్టిగా పట్టుకుని పైకి లాగారు. అయితే కొండచిలువ చాలా భారీగా ఉండడంతో దాని బరువు అధికంగా ఉండడంతో కొండచిలువను పైకి లాగడానికి చాలా కష్టపడ్డారు. చెమటలు పట్టేటంత కష్టపడ్డారు.
View this post on Instagram
ఈ వీడియో వైల్డ్‌లైఫ్011 అనే ఐడితో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. 40 వేల కంటే ఎక్కువ వ్యూస్ ను వందల లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ భారీ కొండచిలువను రక్షించడం చూసి యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. అంతెందుకు ఇంత పెద్ద కొండచిలువను చూస్తే ఎవరికైనా గుండె జారిపోతుందని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..