Tight Dress Effects: టైట్‌గా ఉండే దుస్తులు ధరిస్తున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే ఇక అలా చేయరు..!
Tight Dress Effects: కంఫర్ట్‌గా ఉన్నాయని బిగుతుగా ఉండే దుస్తులను వేసుకుంటున్నారా? ఫ్యాషన్ కోసమని టైట్ దుస్తులు వేశారో అంతే సంగతులు అంటున్నారు నిపుణులు.

Tight Dress Effects: కంఫర్ట్‌గా ఉన్నాయని బిగుతుగా ఉండే దుస్తులను వేసుకుంటున్నారా? ఫ్యాషన్ కోసమని టైట్ దుస్తులు వేశారో అంతే సంగతులు అంటున్నారు నిపుణులు. తేడా వస్తే ప్రాణాలే పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు కూడా. మరీ టైట్ డ్రెస్సులు ధరించడం వల్ల కలిగే అపాయమేంటి? నిపుణులు చేస్తున్న హెచ్చరికలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో యువత నుంచి పెద్దల వరకు అందరూ టైట్ దుస్తులను ధరించేందుకే ఆసక్తి చూపుతున్నారు. అయితే, అలా ధరించడం ప్రాణాంతకం అని చెబుతున్నారు స్కిన్ నిపుణులు. స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుకృత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టైట్‌గా ఉండే బట్టలు వేసుకున్నప్పుడు చర్మం కోతకు గురై ఇన్‌ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా తేమలాంటి పదార్థంలా పేరుకుపోతుంది.
దీనికి వెంటనే చికిత్స చేయకపోతే.. ఆ ప్రదేశంలో చర్మ గ్రంధులు మూసుకుపోయి ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌గా మారుతుంది. ఇది ఇమ్యూనిటీ బలహీనంగా ఉండే వారికి సోకే అవకాశం ఎక్కువగా ఉంది. టైట్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల సెప్సిస్, సెల్యూలైటీస్ అనే స్కిన్ ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. ఈ ఇన్‌ఫెక్షన్ తీవ్రమైతే.. అలర్జీ వల్ల రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించి.. అన్ని అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీని వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఉందని డాక్టర్ సుకృత చెబుతున్నారు. అందువల్ల టైట్ డ్రెస్సెస్ వేసుకునే వారు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బిగుతైన దుస్తులు ధరించడం కంటే కంఫర్ట్‌గా.. కొంచెం వదులుగా ఉండే డ్రెస్సులు ధరించడం మేలని సూచిస్తున్నారు.
Also read:
Andhra Pradesh Politics: 33 ఏళ్ల టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టిన వైసీపీ.. ప్రత్యేక కథనం మీకోసం..!
Amala Paul: భారీ ప్రాజెక్ట్‌ను మిస్ చేసుకున్న అమలాపాల్ ? .. కారణమేంటంటే..
Khammam MLC: టీఆర్ఎస్ పార్టీకి సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక.. ఒక సీటు కోసం ఆరుగురు పోటీ..!