Hello Happiness: ఒక్క ట్వీట్ చేయండి..అన్నార్తుల ఆకలి తీర్చండి అంటూ.. హర్ష గోయెంకా హల్లో హ్యాపీనెస్ ఛాలెంజ్
Hello Happiness:మనం ఇప్పటి వరకూ ఐస్ బకెట్ ఛాలెంజ్(Ice Bucket Challenge), సింగింగ్ ఛాలెంజ్(Singing Challenge), రైస్ బకెట్ ఛాలెంజ్(Rice Bucket Challenge) అంటూ రకరకాల ఛాలెంజ్ ల గురించి విన్నాం..
Hello Happiness:మనం ఇప్పటి వరకూ ఐస్ బకెట్ ఛాలెంజ్(Ice Bucket Challenge), సింగింగ్ ఛాలెంజ్(Singing Challenge), రైస్ బకెట్ ఛాలెంజ్(Rice Bucket Challenge) అంటూ రకరకాల ఛాలెంజ్ ల గురించి విన్నాం.. చూశాము కూడా.. అయితే తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా సరికొత్త ఛాలెంజ్ తో అందరి ముందుకు వచ్చారు. ట్విటర్ వేదికగా హర్ష గోయెంకా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం.. అన్నార్తులకు పట్టెడన్నం పెట్టనుంది. ట్విటర్‌లో ప్రతి ఒక్కరు తమ ఆనందక్షణాలను పంచుకొని..కొందరి ఆకలిని తీర్చవచ్చు. అందుకోసం ఆయన హల్లో హ్యాపీనెస్ ట్రెండ్‌ను ప్రారంభించారు. అలాగే పేటీఎం బాస్ విజయ్ శేఖర్‌కు హ్యాపీనెస్ ఛాలెంజ్ విసిరారు. నేను హ్యాపీనెస్ చెయిన్‌ను ప్రారంభిస్తున్నాను. మీ జీవితంలోని ఆనందక్షణాలను పంచుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ చెయిన్‌లో మిగతా వారిని కూడా భాగస్వాముల్ని చేయండి. అలాగే #HelloHappiness, #TweetAMeal హ్యాష్‌ట్యాగ్‌లను జోడించండి. మీరు చేసే ప్రతి ట్వీట్‌తో ఒకరికి భోజనం అందుతుంది. ఫీడ్‌ఇండియా ద్వారా ఆర్‌పీజీ ఫౌండేషన్ ఒక ప్లేట్ భోజనాన్ని వితరణ చేస్తుంది. మరి నా ఆనంద క్షణమేంటంటే.. సముద్రం ఒడ్డున బీచ్‌లో అలా నడుచుకుంటూ వెళ్లడం’ అంటూ గోయెంకా ఈ ట్రెండ్‌ను ప్రారంభించారు. దీనికి విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. మీరు గొప్ప చొరవ తీసుకున్నారు సర్. లాంగ్ డ్రైవ్‌లు నాకు ఎంతో ఆనందాన్నిస్తాయి. అంటూ ట్వీట్ చేశారు. అలాగే సింగర్ అద్నాన్ సమి “నా కుటుంబంతో ఉన్నప్పుడు నాకు అమితమైన ఆనందం కలుగుతుంది’ అంటూ స్పందించారు. ఇక కాంగ్రెస్ నేత మిలింద్ డియోరా.. గిటార్ వాయించడం, మా ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన వారితో మాట్లాడటం, మా చిట్టితల్లి ఎదుగుదలను ఆస్వాదించడం, ఇతరుల ముఖాల్లో సంతోషాన్ని చూడటం నన్ను అహ్లాదంగా మారుస్తాయి. అంటూ తనకు సంబంధించిన నాలుగు సంతోషాలను చెప్పి.. నలుగురికి ఆహారం అందించాలని ఆయన..కోరారు.’
@_sayema I’m starting a HAPPINESS chain. I invite you to join with your happy moment. Spread the word for all to join the chain. Add #HelloHappiness #TweetAMeal. For every tweet RPG Foundation donates a meal thru @FeedingIndia. My happy moment is a walk on the beach pic.twitter.com/MEEltKjbAl
— Harsh Goenka (@hvgoenka) February 10, 2022
నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ కూడా గోయెంకా ఛాలెంజ్‌కు స్పందించారు. నా పిల్లలతో ఆడుకోవడమే నాకెంతో ఇష్టమైన విషయం. అంటూ హల్లో హ్యాపీనెస్ ఛాలెంజ్ పూర్తి చేశారు. క్రికెటర్ అజింక్య రహానే సూర్యోదయాన్ని వీక్షించడటం.. నన్నెంతో ఆనందపరుస్తుంది…అంటూ ఇలా పలువురు ప్రముఖులు తమ సంతోషాలను వెల్లడిచేశారు. ప్రస్తుతానికి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇంకెందుకాలస్యం.. మీ ఇష్టాలు కూడా పంచుకోండి మరి..!
Also Read: