Interview Experience: ఆన్ లైన్ ఇంటర్వ్యూలో యువతి చేసిన పనికి బాస్ షాక్..నువ్వు వద్దు అంటూ జాబ్ రిజెక్ట్..వీడియో వైరల్
Interview Experience: మనిషి జీవితాన్ని కరోనా(Corona)కు ముందు తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది. అవును ఈ మహమ్మారి మనిషి జీవితంపై భారీ ప్రభావం చూపించింది.. మానవ జీవనశైలినే మార్చేసింది. ఈ మహమ్మారికి..
Interview Experience: మనిషి జీవితాన్ని కరోనా(Corona)కు ముందు తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది. అవును ఈ మహమ్మారి మనిషి జీవితంపై భారీ ప్రభావం చూపించింది.. మానవ జీవనశైలినే మార్చేసింది. ఈ మహమ్మారికి భయపడి అనేక సంస్థలు తమ కార్యకలాపాలను ఇంటినుంచే నిర్వహించేలా చర్యలు చేపట్టాయి. ఈక్రమంలో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చి ఇంటివద్ద నుంచి విధులు నిర్వర్తించే వెసులబాటు కల్పించాయి. అంతేకాదు.. కొత్తగా ఎంప్లాయిస్‌ను అపాయింట్ చేసుకునేందుకు ఇంటర్వ్యూలు సైతం ఆన్ లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో పలు ఫన్నీ ఘటనలు జరిగిన వీడియోలు నెట్టింట చాలానే వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది ఒక ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో. స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ అటెండెంట్ జాబ్ కోసం ఆన్‌లైన్‌లో ఓ యువతి ఇంటర్వ్యూ కోసం సిద‍్ధమైంది.
ఈ సందర్భంగా.. ‘స్కైవెస్ట్ కంపెనీ కల్చర్ పై మీ అభిప్రాయం ఏంటి’ అని ఆ యువతిని సంస్థ అధికారి ప్రశ్నించారు. అందుకు ఆమె ఫన్నీగా తన పక్కనే ఉన్న వేరొకరితో ‘నా జీవితంలో నేను విన్న అతి తెలివితక్కువ, చీజీ ప్రశ్న’ఇది అంటూ సమాధానం ఇవ్వడంతో సదరు అధికారి ఒక్కసారిగా షాక్‌కి గురైంది. అంతేకాకుండా ఆ సమయంలో వీడియో కొంచెం సేపు పాజ్‌లో పెట్టి మరీ ఆ యువతి లిప్ గ్లాస్ వేసుకుంటూ కనిపించడం అధికారిని ఆశ‍్చర్యానికి గురి చేసింది. అయితే, ఆ యువతి ఇంటర్వ్యూ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పొరపాటున ఆమె ఇంటర్వ్యూ వీడియో రికార్డు ఆన్ చేయడంతో ఇదంతా జరిగింది. ఇక తన తప్పును తెలుసుకున్న యువతి వెంటనే తేరుకుని తన సమాధానంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. స్కైవెస్ట్ కంపెనీ ఆమె ప్రవర్తన సరిగా లేదంటూ జాబ్ రిజెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు చాలామంది పాపం ఆమెకు మరే కంపెనీలో జాబ్ రాదంటే… మరి కొందరేమో అలాంటిది ఏమీ ఉండదు ఇక్కడ కాకపోతే మరో చోట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: