Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Selfie with Pufferfish: చేపతో డైవింగ్ పాప సెల్ఫీ వీడియో.. సోషల్ మీడియాలో చేస్తోంది హంగామా..మీరూ చూసేయండి మరి!

Selfie with Pufferfish: ఫోటోలు తీయించుకోవడం అంటే అందరికీ ఇష్టమే. ఇప్పుడు సెల్ఫీ అంటే చాలా మోజు అందరికీ. ఏ చిన్న అవకాశం వచ్చినా ఓ సెల్ఫీ దిగిపోయి.. దానిని సోషల్ మీడియాలో పెట్టేసి మురిసిపోయేవారు ఎందరో వున్నారు.

Selfie with Pufferfish: చేపతో డైవింగ్ పాప సెల్ఫీ వీడియో.. సోషల్ మీడియాలో చేస్తోంది హంగామా..మీరూ చూసేయండి మరి!
Selfie With Pufferfish
Follow us
KVD Varma

|

Updated on: May 19, 2021 | 3:08 PM

Selfie with Pufferfish: ఫోటోలు తీయించుకోవడం అంటే అందరికీ ఇష్టమే. ఇప్పుడు సెల్ఫీ అంటే చాలా మోజు అందరికీ. ఏ చిన్న అవకాశం వచ్చినా ఓ సెల్ఫీ దిగిపోయి.. దానిని సోషల్ మీడియాలో పెట్టేసి మురిసిపోయేవారు ఎందరో వున్నారు. ఇక ఈ సెల్ఫీల మోజు ఎలా ఉంటుంది అంటే.. ఎక్కడ ఎందుకు సెల్ఫీ దిగుతున్నాము అనేది కూడా చాలా మందికి అనిపించదు. చేతిలో మొబైల్ ఉందా సెల్ఫీ దిగుదామా అంతే. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారూ ఎందరో ఉన్నారు. కొంతమంది చాలా మంచి సెల్ఫీలు దిగి వావ్ అనిపించుకునే వాళ్ళూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ మీకు పరిచయం చేస్తున్న వీడియో అలాంటిదే.. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని మార్నింగ్టన్ ద్వీపకల్పంలోని రై పీర్ సమీపంలో డైవింగ్ చేస్తున్నప్పుడు నీటి అడుగున ఫోటోగ్రాఫర్ కేసీ చేపలను గుర్తించింది. అందులో చాలా స్నేహపూర్వకమైన చేపలు పఫర్ ఫిష్ కూడా ఉంది. ఆ చేప తన పక్కన ఉండగా నీటి అడుగునే ఆమె సెల్ఫీ వీడియో తీసింది. ఇప్పుడు ఈమె సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇందులో విశేషం ఏమిటంటే ఈమె సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే ఆ చేప కూడా ఆమెతో పాటు వీడియో కోసం ఫోజు ఇచ్చినట్టు నిలబడింది. ఇక్కడ ఆ వీడియో మీరూ చూసేయొచ్చు..

ఒక ఇంటర్వ్యూలో కేసీ మాట్లాడుతూ, తాను డైవ్స్ సమయంలో తరచూ వివిధ జాతులను చూస్తుంటాను అని చెప్పింది. అప్పుడప్పుడు ఈ పఫర్ ఫిష్ వంటి “చాలా స్నేహపూర్వక” వాటిని తాను చూస్తుంది. అందంగా ఉన్న ఆ ఫిష్ ను చూసిన వెంటనే మా ఈ అందమైన సెల్ఫీని తీయాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పింది. ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుండి, ఈ క్లిప్ 30,000 మందికి పైగా లైక్‌లను సంపాదించింది. అలాగే పఫర్ ఫిష్‌పై నెటిజన్లు స్పందించడంతో కామెంట్లు వరదలా వచ్చాయి