AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ అమ్మాయి క్రేజీ డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే.. నెట్టింట వీడియో ట్రెండింగ్!

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు ఎన్నో హల్చల్ చేస్తుంటాయి. పలువురు స్టంట్స్ చేస్తే.. మరికొందరు ప్రాంక్స్ చేస్తారు. ఇంకొందరు డ్యాన్స్‌ మూవ్స్‌తో..

Viral Video: ఈ అమ్మాయి క్రేజీ డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే.. నెట్టింట వీడియో ట్రెండింగ్!
Viral Video
Ravi Kiran
|

Updated on: Jan 07, 2022 | 1:38 PM

Share

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు ఎన్నో హల్చల్ చేస్తుంటాయి. పలువురు స్టంట్స్ చేస్తే.. మరికొందరు ప్రాంక్స్ చేస్తారు. ఇంకొందరు డ్యాన్స్‌ మూవ్స్‌తో ఆకట్టుకుంటారు. తమకు నచ్చిన హీరో హీరోయిన్లకు సంబంధించిన పాటలకు డ్యాన్స్ చేసి.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో నెటిజన్లతో షేర్ చేసుకుంటారు కొంతమంది వ్యక్తులు. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూశాక మీరు కూడా ఖచ్చితంగా వావ్ అనాల్సిందే.

వైరల్ వీడియో ప్రకారం.. స్లమ్ ఏరియా లాంటి ప్రాంతంలో స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఓ అమ్మాయి.. గురు రంధవా, నోరా ఫతేహి కలిసి నటించిన ‘నాచ్ మేరీ రాణి’ అనే పాటకు డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఆమె చేసిన క్రేజీ మూవ్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ కావడంతో గురు రంధావా, నోరా ఫతేహిలు కూడా దానిని రీ-ట్వీట్ చేసి.. ఆ అమ్మాయిని అభినందించారు.

కాగా, గురు రంధావా తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేయగా.. ఇప్పటివరకు దీనిని 23 లక్షల మందికి పైగా వీక్షించారు. ‘అమ్మాయి డ్యాన్స్ అదరగొట్టేసింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.