AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: టీ కొట్టు యజమాని ఖాతాలో రూ. 999 కోట్లు..! ఆనందపడే లోపే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్

అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే.. దురదృష్టం వచ్చి హాగ్ చేసుకున్నట్టు ఉంది వీళ్ల పరిస్థితి. అతడొక చిన్న కాఫీ షాప్ నడుపుతున్నాడు. ఓ రోజు తన భార్య ఖాతా చూడగా.. అనూహ్యంగా వెయ్యి కోట్లు వచ్చిపడ్డాయి. ఆ డబ్బును చూడగానే తెగ ఆనందపడిపోయారు భార్యాభర్తలు. అయితే వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.

Viral: టీ కొట్టు యజమాని ఖాతాలో రూ. 999 కోట్లు..! ఆనందపడే లోపే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
Virla
Ravi Kiran
|

Updated on: Oct 13, 2024 | 10:32 AM

Share

అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే.. దురదృష్టం వచ్చి హాగ్ చేసుకున్నట్టు ఉంది వీళ్ల పరిస్థితి. అతడొక చిన్న కాఫీ షాప్ నడుపుతున్నాడు. ఓ రోజు తన భార్య ఖాతా చూడగా.. అనూహ్యంగా వెయ్యి కోట్లు వచ్చిపడ్డాయి. ఆ డబ్బును చూడగానే తెగ ఆనందపడిపోయారు భార్యాభర్తలు. అయితే వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పొరపాటున ఖాతాలో ఆ డబ్బు పడిందని బ్యాంక్ అధికారులు వాటిని వెనక్కి తీసుకోవడమే కాదు.. అకౌంట్ కూడా ఫ్రీజ్ చేశారు. కట్ చేస్తే.. ఆ ఖాతాను అన్ బ్లాక్ చేసేందుకు సహకరించాల్సింది పోయి.. ఆ బ్యాంక్ అధికారులు వీరిని రోజూ తిప్పించుకోవడంతో ఉన్న వ్యాపారం కాస్తా అటకెక్కింది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని ఐఐఎంలో ప్రభాకర్ అనే వ్యక్తి చిన్న కాఫీ షాప్ నడుపుతున్నాడు. ఇక ఓ రోజు ఆయన భార్య ఖాతాలోకి దాదాపుగా రూ. 999 కోట్లు జమ అయినట్లు గుర్తించాడు. అంత డబ్బు చూసి సంబరపడిపోయిన భర్త.. విషయాన్ని భార్యకు తెలియజేశాడు. ఆమె సంతోషానికి కూడా అవధులు లేవు. అయితే వీరి సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. కొన్ని నిమిషాల్లోనే ఆమె ఖాతాలోకి కోట్ల రూపాయలు పొరపాటును ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు.. ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడమే కాదు.. ఖాతాను కూడా ఫ్రీజ్ చేశారు. ఇక అందులోనే భార్యాభర్తల సేవింగ్స్ డబ్బు కూడా ఉండిపోవడంతో.. వారిద్దరికీ ఏడుపు ఒక్కటే తక్కువ. ఆ ఖాతాను అన్ ఫ్రీజ్ చేసేందుకు బ్యాంకు ఎన్నిసార్లు తిరిగినా.. అధికారులు అతడ్ని పట్టించుకోలేదు. ఇక ఈలోగా వారి కాఫీ షాప్ కాస్తా దివాలా తీసింది.

సాయం చేయాల్సిన బ్యాంక్ అధికారులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అసలు ఇంతకీ ఎంత డబ్బు ఎలా వచ్చాయో.? వివరాలు ఇవ్వాలని వేదిస్తున్నారని గగ్గోలు పెట్టుకున్నాడు ప్రభాకర్. బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేసి.. తమ కష్టార్జితంపై దెబ్బ కొట్టారని.. షాప్ దివాళా తీసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై బ్యాంక్ అధికారులు ఏవిధంగా స్పందించలేదంటూ బాధపడ్డాడు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతన్ని ఆర్బీఐకి సమాచారం అందించాలని చెబుతున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఈ ఫోటోలో మొదటిగా కనిపించేదే మీరెలాంటి వారో చెప్పేస్తోంది.? ఎలాగంటారా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు