ఆ పావురం ధర అక్షరాలా 10 కోట్లు.. ఎందుకో తెలుసా.?

ఆ పావురం ధర అక్షరాలా 10 కోట్లు.. ఎందుకో తెలుసా.?

మాములుగా ఒక పావురం ధర ఎంత ఉంటుంది.? వందల్లో లేదా వేలల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పావురం ధర 10 కోట్లు. షాక్ అయ్యారా.? పావురం 10 కోట్లు ఏంటి అని అనుకుంటున్నారా. అయితే పదండి అదేంటో తెలుసుకుందాం. బెల్జియం దేశానికి చెందిన ఒక పావురం ధర అక్షరాలా 10 కోట్లు. దాని పేరు అర్మాండో. బెల్జియంలో లాంగ్ డిస్టెన్స్ రేస్ లో అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేరుకునే పావురం ఇది. ఇక ఈ పావురం […]

Ravi Kiran

|

Mar 27, 2019 | 10:51 AM

మాములుగా ఒక పావురం ధర ఎంత ఉంటుంది.? వందల్లో లేదా వేలల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పావురం ధర 10 కోట్లు. షాక్ అయ్యారా.? పావురం 10 కోట్లు ఏంటి అని అనుకుంటున్నారా. అయితే పదండి అదేంటో తెలుసుకుందాం.

బెల్జియం దేశానికి చెందిన ఒక పావురం ధర అక్షరాలా 10 కోట్లు. దాని పేరు అర్మాండో. బెల్జియంలో లాంగ్ డిస్టెన్స్ రేస్ లో అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేరుకునే పావురం ఇది. ఇక ఈ పావురం కోసం ఇద్దరు చైనీయులు మనసు పారేసుకున్నారట.. అంటే దానిని దక్కించుకోవడానికి కోట్లు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. అలా చివరికి వేలం పాటలో 10 కోట్లకు దక్కించుకున్నారట.

బెల్జియంకు చెందిన పిజియన్ రేసింగ్ వెబ్ సైట్ ఈ వివరాలను పొందుపరిచింది. ఈ ఇద్దరు చైనీయులు ఆ పావురం కోసం తీవ్రంగా పోటీ పడ్డారట. ఇక ఈ వేలం పాట మార్చి 17న ఓ గంట పాటు సాగిందని సమాచారం. వేలం పాట మొదట 6,00,000 డాలర్లకు చేరుకోగానే అందరూ షాక్ అయ్యారట. కానీ ఈ ఇద్దరు చైనీయులు పోటాపోటీగా వేలం పాటను తీసుకెళ్లి 14,00,000 మిలియన్ డాలర్ల దగ్గర ఆపారట. మన భారత కరెన్సీ ప్రకారం ఆ విలువ అక్షరాలా 10 కోట్లు. కాగా ఆ అర్మాండో పావురం వయసు ఐదేళ్ళ అని తెలుస్తోంది. రిటైర్మెంట్ కు దగ్గర్లో ఉన్నా ఇంత ధర పలకడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా ఆ పావురం రెక్కల్లో ఉండే అసాధారణమైన బలం, వేగంగా దూసుకెళ్లే తత్వం వల్ల ఇంత ధర పలకడానికి కారణం అయి ఉండవచ్చు అని కొంతమంది భావిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu