AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ ట్వీట్… వైరల్…

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ఉదయం 11.45 నుంచీ 12.00 గంటల మధ్య జస్ట్ పావుగంటలో ఏదో కీలక ప్రసంగం చెయ్యబోతున్నారని ముందుగానే ట్విట్టర్‌లో ట్వీట్ చెయ్యడంతో… ఒక్కసారిగా దేశ ప్రజలంతా ఆయన ఏం చెప్పబోతున్నారని ఆసక్తిగా గ‌మనించారు. ఇక నెటిజన్లైతే ఆ ట్వీట్‌కి నిమిషానికి వెయ్యి లైక్స్ కొట్టి వైరల్ ట్వీట్‌గా మార్చేశారు. 11.23కి ట్వీట్ పోస్ట్ చెయ్యగా… కొన్ని నిమిషాలకే అది వైరల్ అయ్యింది. మొదటి గంటలో దానికి 57,663 లైక్స్, 20,663 […]

ప్రధాని మోదీ ట్వీట్... వైరల్...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 27, 2019 | 6:23 PM

Share

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ఉదయం 11.45 నుంచీ 12.00 గంటల మధ్య జస్ట్ పావుగంటలో ఏదో కీలక ప్రసంగం చెయ్యబోతున్నారని ముందుగానే ట్విట్టర్‌లో ట్వీట్ చెయ్యడంతో… ఒక్కసారిగా దేశ ప్రజలంతా ఆయన ఏం చెప్పబోతున్నారని ఆసక్తిగా గ‌మనించారు. ఇక నెటిజన్లైతే ఆ ట్వీట్‌కి నిమిషానికి వెయ్యి లైక్స్ కొట్టి వైరల్ ట్వీట్‌గా మార్చేశారు. 11.23కి ట్వీట్ పోస్ట్ చెయ్యగా… కొన్ని నిమిషాలకే అది వైరల్ అయ్యింది. మొదటి గంటలో దానికి 57,663 లైక్స్, 20,663 రీట్వీట్స్ వచ్చాయి. అలాగే 15,000 కామెంట్స్ వచ్చాయి.

మధ్యాహ్నం 12.26 నిమిషాలకి ప్రధాని ప్రసంగం ప్రారంభమైంది. శాటిలైట్లను కూల్చగలిగే శక్తి సామర్ధ్యాల్ని భారత్ సమకూర్చుకుందనీ, లో ఎర్త్ ఆర్బిట్‌లో తిరిగే ఓ శాటిలైట్‌ను భారత్ విజయవంతంగా కూల్చగలిగిందని మోదీ తన ప్రసంగంలో తెలిపారు. ఐతే ఏ దేశానికీ వ్యతిరేకంగా భారత్ ఈ శక్తిని సంపాదించుకోలేదని వివరించారు. ఇదో గొప్ప విజయంగా మోదీ అభివర్ణించారు.

Follow Us