దేవుడిపై భక్తులు గుళ్లకు వెళ్లటం, పూజులు చేయటం సర్వసాధారణం..అయితే, దేవుడు ఉన్నాడని చెప్పేందుకు కొన్నిసార్లు ఊహాతీతమైన అద్భుతాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే గతంలో నంది విగ్రహం పాలు తాగిందని, హనుమంతుడు నోటికి అందించిన నీరు, పాలు మాయం చేశాడని అనేక వార్తలు విన్నాం. చూశాం.. మొన్నటికి మొన్న వేప చెట్టు నుండి పాలు కారటం కూడా చూశాం.. ఇదంతా అమ్మవారి మహిమగా భక్తులు పసుపు కుంకుమలతో పూజలు చేయటం, మొక్కులు చెల్లించటం చూశాం.. రావిచెట్టుకు నీళ్లు కారటం కూడా చూశాం.. ఇప్పుడు అలాంటి మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. హుజూరాబాద్ – రామాలయం వద్ద ఉన్న శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. శివలింగం చుట్టూ చుట్టుకొని నాగుపాము చుట్టుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హుజూరాబాద్ పట్టణంలోని రామాలయ గర్భ గుడికి ఎదురుగా ఉన్న శివలింగంపై ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయంలో శివలింగాన్ని నాగుపాము చుట్టుకుని కనిపించింది. ఆ సుందర దృశ్యాన్ని చూసిన భక్తులు మొదట భయాందోళనకు గురయ్యారు.. కానీ, ఆ తర్వాత నాగరాజు సమేత శివలింగ దర్శన భాగ్యం తమకు కలిగిందంటూ ఆనందంతో ఉక్కిబిక్కిరి అయ్యారు.
అదేవిధంగా ఆలయ అర్చకులు నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అమోఘమైన సంఘటన చూసేందుకు రామాలయానికి పట్టణ ప్రజలు క్యూ కట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విడుదలై వైరల్ అవుతోంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..